Discount On Mahindra Scorpio N: మహీంద్రా స్కార్పియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, భారతీయ కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందిన కార్‌ ఇది. ఆనంద్‌ మహీంద్ర కలల ప్రాజెక్ట్‌గా వచ్చిన ఈ కార్‌, వాహన రంగాన్ని ఓ ఊపు ఊపింది, హోదాకు చిరునామాగా నిలిచింది. ఈ వాహనానికి ఇప్పటికీ డిమాండ్ ఎక్కువగా ఉండటానికి కారణం దీని స్టైల్‌ & రఫ్‌ లుక్స్‌. మీరు స్కార్పియో N కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇప్పుడు మీకు గొప్ప అవకాశం అందుబాటులో ఉంది. ఈ నెలలో (మే 2025) మహీంద్రా కంపెనీ ఈ SUV మీద అట్రాక్టివ్‌ డిస్కౌంట్లను అందిస్తోంది. స్కార్పియో N పై కంపెనీ రూ. 65 వేల వరకు తగ్గింపును ప్రకటించింది. 

తెలుగు రాష్ట్రాల్లో స్కార్పియో N ధరస్కార్పియో N ఎక్స్-షోరూమ్ ధర (Scorpio N ex-showroom price) రూ. 13 లక్షల 99 వేల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు రూ. 25.15 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) వరకు ఉంటుంది. ఈ నెలలో, MY24 మోడల్‌పై రూ. 65,000 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు. ఈ ఆఫర్‌ నగరం, డీలర్‌షిప్, స్టాక్‌ను బట్టి మారవచ్చు. రిజిస్ట్రేషన్‌ (RTO) ఖర్చు 2,41,064 రూపాయలు, వాహన బీమా (Insurance) 1,02,406 రూపాయలు, ఇతర ఛార్జీలు 15,992 రూపాయలు కలుపుకుని.. తెలుగు రాష్ట్రాల్లో బేస్‌ మోడల్‌ ఆన్‌-రోడ్‌ ధర (Scorpio N on-road price) రూ. 17.59 లక్షల నుంచి స్టార్ట్‌ అవుతుంది. టాప్‌ ఎండ్‌ మోడల్‌ ఆన్‌-రోడ్‌ ధర 31.03 లక్షల వరకు ఉంటుంది.

స్కార్పియో N పవర్‌ట్రెయిన్స్‌స్కార్పియో Nలో రెండు ఇంజిన్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి, అవి - పెట్రోల్‌ ఇంజిన్‌ & డీజిల్‌ ఇంజిన్‌. వేరియంట్‌ను బట్టి, 2.2 లీటర్ డీజిల్ యూనిట్‌ 132 PS/300 Nm లేదా 175 PS/400 Nm వరకు జనరేట్‌ చేయగలదు & 2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ 203 PS/380 Nm వరకు జనరేట్‌ చేయగలదు. రెండు ఇంజిన్‌ ఆప్షన్స్‌లోనూ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ (AMT) అందుబాటులో ఉన్నాయి, ఈ వ్యవస్థలు కుదుపుల్లేని ప్రయాణం కోసం డ్రైవర్‌కు ఫుల్‌ సపోర్ట్‌ చేస్తాయి. అంటే, ఈ ట్రాన్స్‌మిషన్స్‌ సోఫోలా సాఫీగా కూర్చున్నంత హాయిగా జర్నీ సాగించడంలో సాయపడతాయి.         

స్కార్పియో N ఫీచర్లుస్కార్పియో N క్యాబిన్‌లో కనిపించే కీలక ఫీచర్ల విషయానికి వస్తే... ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ & వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ఉన్నాయి. నడిపే వ్యక్తి సౌలభ్యం కోసం 6-వే-పవర్ డ్రైవర్ సీటు, సన్‌రూఫ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల సేఫ్టీ కోసం కారులో 6 ఎయిర్‌బ్యాగులు, ముందు & వెనుక కెమెరాలు, హిల్-అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి ఫీచర్లను ఏర్పాటు చేశారు. 

మహీంద్రా స్కార్పియో N, మన మార్కెట్‌లో, టాటా సఫారీ & MG హెక్టర్ ప్లస్ వంటి కార్లకు పోటీ ఇస్తుంది.