Dassault aviation share price continues high rise: రాఫెల్  జెట్ తయారీ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ షేరు ధర వరుసగా పెరుగుతోంది. ఫ్రెంచ్ స్టాక్ మార్కెట్‌లో 297 యూరోలు దాటిపోయింది. రోజురోజుకు క్రమంగాపెరుగుతోంది. నిజానికి ఈ స్టాక్  ధర గత నెలలో కాస్తంత తగ్గింది. గత ఒక నెలలో రాఫెల్ జెట్ తయారీదారుల స్టాక్‌లో 3 శాతం తగ్గుదల తర్వాత షేర్లు పెరగడం ప్రారంభించాయి. 


ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశ రఫెల్ ఫైటర్ జెట్‌లను పాకిస్తాన్ కూల్చివేసిందనే వాదనలను రక్షణ కార్యదర్శి ఆర్‌కె సింగ్ తోసిపుచ్చారు. అయితే ఓ జెట్ కూలిపోయిందని కానీ పాకిస్తాన్ చేసిన దాడుల వల్ల కాదని..  సాంకేతిక కారణాల వల్ల అని దస్సాల్ట్ చైర్మన్ అండ్ సీఈవో ప్రకటించారు. ఇలా ప్రకటించినప్పటికీ.. షేర్లుధ ధరలు పెరుగుతున్నాయి.  డస్సాల్ట్ ఏవియేషన్ ఒప్పందం, ప్రమోటర్ వాటా పెంపు తర్వాత రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు పెరిగాయి.  


డస్సాల్ట్ ఏవియేషన్ చైర్మన్ , CEO ఎరిక్ ట్రాపియర్ కూడా పాకిస్తాన్ వాదనను తోసిపుచ్చారు.  సాంకేతిక వైఫల్యం కారణంగా భారతదేశం ఒక జెట్‌ను కోల్పోయిందని, ఈ సంఘటనపై దర్యాప్తు ప్రస్తుతం జరుగుతోందని ఆయన చెబుతున్నారు. ఈ సంఘటనలో ఎటువంటి శత్రువు ప్రమేయం లేదని ఫ్రెంచ్ నివేదిక స్పష్టం చేసింది.   శిక్షణా మిషన్ సమయంలో 12,000 మీటర్ల ఎత్తులో జరిగింది, శత్రువుల ప్రమేయం లేదా శత్రు రాడార్  వల్ల ఇది జరగలదేని దసాల్ట్ స్పష్టం చేసింది.  



భారత రక్షణ అటాచ్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభ దశలో పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోకుండా నిరోధించే ఆంక్షల కారణంగా భారత వైమానిక దళం యుద్ధ జెట్‌లను కోల్పోయిందని నిపుణులు చెబుతున్నారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై మాత్రమే దాడులు చేయడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సైనిక సంస్థపై లేదా వారి వైమానిక రక్షణ వ్యవస్థపై దాడి చేయకూడదని రాజకీయ నాయకత్వం ఇచ్చిన పరిమితి కారణంగా మాత్రమే ఇది జరిగిందని సైనిక వర్గాలుచెబుతున్నాయి. 



మే 7, 2025న భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్‌ తర్వాత డస్సాల్ట్ ఏవియేషన్ పై అందరి దృష్టిపడింది.  ఈ స్టాక్ ప్రారంభంలో దాదాపు 66 శాతం లాభపడింది, తర్వాత ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి..దస్సాల్ట్ కు మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతున్నారు.  స్టాక్‌ను 330 యూరోల వైపు వెళ్తుందని నమ్ముతున్నారు.