Eris Covid Variant: మూడేళ్ల పాటు కరోనా ప్రపంచాన్ని గడగడలాడించింది. ప్రజలు ఇప్పుడిప్పుడే  హమ్మయ్యా అనుకుంటూ సాధారణ జీవితాన్ని మొదలు పెట్టేలోపే మరో ప్రమాదం ముంచుకొస్తుంది. రోజుకో కొత్త వేరియంట్‌లో కలకలం రేపుతోంది. అమెరికాలో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈజీ. 5 (EG.5) వేరియంట్‌ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్‌ కేసులకు కారణమవుతోంది. చైనా, దక్షిణ కొరియా, జపాన్, కెనడాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.


ఒమిక్రాన్ జాతికి చెందిన ఈ కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 1.9.2 (XBB.1.9.2) రికాంబినెంట్ వైరస్‌ నుంచి పుట్టుకొచ్చిందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది ఎక్స్‌బీబీ 1.9.2‌ స్ట్రెయిన్‌తో పోలిస్తే ఈజీ.5లోని స్పైక్ ప్రోటీన్‌లో ఒక జన్యుమార్పు (మ్యూటేషన్) అదనంగా ఉందని గుర్తించినట్లు చెప్పారు. ఈ కొత్త మ్యూటేషన్ గతంలో ఇతర కరోనా వేరియంట్లలో కూడా గుర్తించామని వారు వెల్లడించారు.


ఈజీ.5 కాకుండా ఎరిస్‌ (Eric) లేదా ఈజీ.5.1 (EG.5.1) అని పలిచే మరో కొత్త వేరియంట్‌ కూడా ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తోంది. కొవిడ్-19 (Covid-19)లో ఒమిక్రాన్ రకం నుంచి వచ్చిన ఈజీ.5.1 (EG.5.1) ప్రస్తుతం బ్రిటన్ (UK)ని వణికిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతోంది.  దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో దీని వాటా 14.6 శాతంగా ఉందన్నారు. ఈ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. 


ఈ కొత్త రకం వేరియంట్‌ ఒమిక్రాన్ జాతికి చెందిన ప్రస్తుతమున్న ఎక్స్‌బీబీ 1.9.2 (XBB.1.9.2) రికాంబినెంట్ వైరస్‌ నుంచి పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్‌బీబీ 1.9.2‌ స్ట్రెయిన్‌తో పోలిస్తే ఈజీ.5లోని స్పైక్ ప్రోటీన్‌లో అదనంగా ఒక మ్యూటేషన్ (జన్యుమార్పు) కలిగి ఉందని, ఇది 465 స్థానంలో ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో కనిపించిన వ్యాధి లక్షణాలే..  ఈ కొత్త వేరియంట్‌ సంక్రమించిన వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలిపారు.  


WHO  టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్‌ఖోవ్ స్పందిస్తూ, EG.5 వేగంగా వ్యాపిస్తోందని, కానీ ఒమిక్రాన్ వేరియంట్‌ల కంటే ఇది చాలా తక్కువగా ఉందన్నారు. లేదు. 2021లో కలకలం రేపిన ఒమిక్రాన్, ఇతర సబ్‌లైన్‌లతో పోలిస్తే EG.5 తీవ్రతలో మార్పును తాము గుర్తించలేదన్నారు. చాలా దేశాలు COVID-19 డేటాను WHOకి నివేదించడం లేదని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ విచారం వ్యక్తం చేశారు. వైరస్‌ బారిన పడిన వారిలో 11% మంది మాత్రమే ఆసుపత్రి, ఐసీయులో చేరినట్లు ఆయన చెప్పారు. 


ఈ మేరకు WHO కరోనా నియంత్రణ కోసం స్టాండింగ్ కమిటీ సిఫార్సులను జారీ చేసింది. COVID డేటాను, ముఖ్యంగా మరణాల డేటా, అనారోగ్య డేటాను నమోదు చేసే ప్రక్రియను కొనసాగించాలని, టీకాను అందించడాన్ని కొనసాగించాలని ప్రపంచ దేశాలను  కోరింది.


ఎరిస్ లక్షణాలు
ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో కనిపించిన వ్యాధి లక్షణాలే.. ఇంచుమించుగా ఈ కొత్త వేరియంట్‌ సంక్రమించిన వారిలో కూడా కనిపిస్తున్నట్లు WHO అధికారులు తెలిపారు. సాధారణంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో ముక్కు కారడం, తీవ్రమైన తల నొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు, ఆయాసం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే కొత్త వేరియంట్ ఎరిస్‌ సోకిన వారిలో ఈ లక్షణాలే కామన్‌గా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.