What is UKs Pakistani grooming gangs scandal: బ్రిటన్ లో చాలా కాలంగా పాకిస్తాన్ కు చెందిన వారు స్థిరపడుతూ వస్తున్నారు. వీరి ఆలోచనలు ఎలా ఉంటాయో కానీ.. ఇరవై ఏళ్ల కిందటి నుంచి పాకిస్తాన్ కు చెందిన యువకులు గ్రూమింగ్ గ్యాంగులుగా ఏర్పడ్డారు. వారి పని .. బ్రిటన్ జాతీయులైన, శ్వేత జాతీయులైన అమ్మాయిలతో పరిచయాలు పెంచుకోవడం.. వారితో శారీరక సంబంధాలు పెట్టుకోవడం.. బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి చేసేవారు. 2000లు ప్రారంభంలో ఈ ఘటనలు విపరీతంగా బయటపడ్డాయి, ముఖ్యంగా యోర్క్‌షైర్, రోచ్డేల్, టోటెన్‌హామ్, మరియు ఇతర ప్రాంతాలలో బ్రిటన్ బాలికలు అనేక మంది ఈ గ్యాంగుల ధాటి బలైపోయారు. 

ఈ ఘటనలన్నీ యాధృచ్చికంగా జరగలేదని గ్యాంగులుగా ఏర్పడి చేశారని బ్రిటన్ పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. అందుకే బ్రిటన్ లో దీన్ని "గ్రూమింగ్ గ్యాంగ్ స్కాండల్" అని పిలుస్తున్నారు.ఈ గ్రూమింగ్ గ్యాంగ్ లలలో ఉండేవారంతా పాకిస్తాన్ కు చెందిన వారే.  2,65,000 మంది జనాభా కలిగిన రోథర్‌హామ్ పట్టణంలో..  1997 నుండి 16 సంవత్సరాల కాలంలో కనీసం 1,400 మంది బాలికలపై ఒక ముఠా మాదకద్రవ్యాలు ఇచ్చి, అత్యాచారం చేసి, లైంగిక దోపిడీ చేసిందని 2014లో ఓ విచారణ గుర్తించింది.        

Also Read: పావు గంట టైమ్ ఇస్తారు - ఎంత లెక్కపెడితే అంత బోనస్ - ఈ కంపెనీ రూటే వేరు!

దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ  గ్రూమింగ్ గ్యాంగుల అరాచకాలపై ఆ దేశంలో గగ్గోలు రేగింది.  రోథర్‌హామ్ ముఠాలపై దర్యాప్తు చేయడానికి నేషనల్ క్రైమ్ ఏజెన్సీ UKలో అతిపెద్ద ఆపరేషన్ స్టవ్‌వుడ్‌ను ప్రారంభించిం. ఇప్పటివరకు దాదాపు 30 మంది వ్యక్తులకు దీర్ఘకాలిక జైలు శిక్షలను విధించేలా చేసింది. పశ్చిమ ఇంగ్లాండ్‌లోని టెల్‌ఫోర్డ్‌లో   స్వతంత్ర విచారణ  1,000 మందికి పైగా బాధితులు ఉన్నారని అంచనా వేసింది. మాంచెస్టర్ సమీపంలోని రోచ్‌డేల్‌లో జరిగిన మరో దర్యాప్తులో  "ఒక ముఠా" 13 మంది పిల్లలపై లైంగిక హింసకు పాల్పడినందుకు అక్కడి కోర్టులు దాదాపు 40 మంది పురుషులకు శిక్ష విధించాయని తేలింది.

ప్రస్తుతం ఈ గ్రూమింగ్ గ్యాంగుల కార్యకలాపాలు ఉన్నాయో లేదో స్పష్టత లేదు కానీ బ్రిటన్ ప్రధానమంత్రిగా స్టార్మర్ ఎన్నిక కావడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.ఎందుకంటే 2008 మరియు 2013 మధ్య ఇంగ్లాండ్,  వేల్స్‌కు ప్రాసిక్యూషన్ సర్వీస్ అధిపతిగా స్టార్మర్ ఉన్నారు. గ్రూమింగ్ గ్యాంగులపై బహిరంగ విచారణను నిర్వహించడానికి స్టార్మర్  అప్పట్లో అంగీకరించలేదు. ఇది జాతుల మధ్య వైరం తెస్తుందని అది దేశానికి మంచిది కాదన్నారు. అందుకే స్మార్మర్ ప్రధానిగా ఎన్నికయినప్పుడు ఎలాన్ మస్క్ స్పందించారు. 

పాకిస్తాన్ యువకులు శ్వేతజాతీయులైన బాలికలపై ఇలాంటి దురాగతాలకు పాల్పడటంపై పాకిస్తాన్ భిన్నంగా స్పందిదంచింది. ఇస్లామోఫోబియాను పెంచుతున్నారని.. అంతకు మించి ఆ కేసుల్లో ఏం లేదని చెబుతోంది.                 

Also Read : Airplane Crash : గాలిలో హెలికాప్టర్‌ను ఢీకొట్టి, నదిలో కుప్పకూలిన విమానం - నిలిచిపోయిన విమాన రాకపోకలు