What is agro terrorism: సెవన్త్ సెన్స్ అనే సినిమాలో చైనా కు చెందిన వాళ్లు ఓ వైరస్ ను ఇండియాలో వ్యాప్తి చేస్తారు. దాని ద్వారా తమ లక్ష్యాలు సాధించాలని అనుకుంటాు. అలాంటిదే వ్యవసాయ రంగంలో చైనా చేస్తోందన్న ఆరోపమలు వస్తున్నాయి. అమెరికాలో ఇద్దరు చైనీస్ పౌరులు యున్‌క్వింగ్ జియాన్ (33) మరియు, జున్‌యాంగ్ లియు (34)లను అరెస్టు చేశారు. వీరు ప్రమాదకరమైన జీవ రసాయనం *ఫ్యూసేరియం గ్రామినియరం* అనే ఫంగస్‌ను స్మగ్లింగ్ చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. ఈ ఫంగస్ పంటలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది, దీనిని అగ్రో-టెర్రరిజం ఆయుధం"గా ఇప్పటికే నిర్దారించారు.
అగ్రో-టెర్రరిజం పంటలు, పశుసంపద , ఫుడ్ సప్లై చైన్‌ను లక్ష్యంగా చేసుకుని, జీవ రసాయనాలు, పురుగులు, విష పదార్థాలను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడం అనుకోవచ్చు. దీని లక్ష్యం ఆర్థిక నష్టం, ఆహార భద్రతకు ఆటంకం కలిగించడం. తద్వారా సమాజంలో భయాందోళనలు సృష్టించి ఆ దేశాన్ని నిర్వీర్యం చేస్తారు. వ్యవసాయ రంగంపై జరిగే ఇలాంటి టెర్రర్ దాడులను గుర్తించడం కష్టం కావడం వల్ల హాని కలిగించే అవకాశం ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు.
అమెరికాపై ఈ అగ్రో టెర్రరిజాన్ని చైనా ప్రయోగిస్తోందని ఇద్దరు చైనీయులు అరెస్టు చేయడం ద్వారా క్లారిటీ వచ్చినట్లయింది. భారత్ పై కూడా చైనా ఇలాంటి కుట్రలు చేసే అవకాశాలు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశంలో వ్యవసాయం ఆర్థిక వ్యవస్థలో కీలక భాగం, GDPలో సుమారు 17 శాతం వ్యవసాయ రంగానిదే. 55 శాతం మంది ప్రజలకు ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారాపడుతున్నారు. భారతదేశం వ్యవసాయ దేశంగా ఉండటం వల్ల అగ్రో-టెర్రరిజం దాడులకు గురయ్యే అవకాశం ఉంది. ఆహార భద్రతకు ఆటంకం కలిగించే ఏ చిన్న దాడి అయినా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది మరియు జనజీవనాన్ని ప్రభావితం చేస్తుంది.
అమెరికా, ఇతర దేశాలు చైనా జీవ రసాయన పరిశోధనలపై గతంలో ఆందోళనలు వ్యక్తం చేశాయి. ఫ్యూసేరియం గ్రామినియరం వంటి ఫంగస్‌ను స్మగ్లింగ్ చేయడం అనేది అగ్రో-టెర్రరిజం కోసమేనని అనుమానాలు బలపడుతున్నాయి.