Narendra Modi at Ahlan Modi event in UAE : అబుదాబిలో కొత్త చరిత్ర లిఖించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) తెలిపారు. భారత్, యూఏఈ దోస్తీ జిందాబాద్ అన్నారు. అబుదాబి (Abudabi)లోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అహ్లన్ మోడీ కార్యక్రమంలో...ప్రధాని మోడీ మాట్లాడారు. జీవితాంతం యూఏఈకి భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ( president Mohammed bin Zayed Al Nahyan)ను నాలుగు సార్లు భారత్ కు పిలవడానికి అవకాశం లభించిందన్న ఆయన...ఆర్డర్ ఆఫ్ జాయెద్ తో సన్మానించారని గుర్తు చేశారు. యూఏఈ అత్యున్నత పురష్కారం తనకు లభించిందంటే అది భారతీయుల వల్లే సాధ్యమైందంటూ...ఇండియన్స్ పై ప్రశంసలు కురిపించారు. ఈ సన్మానం భారతీయులందరికి గౌరవ కారణమన్నారు ప్రధాని మోడీ. యూఏఈ అధ్యక్షుడు గుజరాత్ వచ్చినపుడు ఆయనను గౌరవించామని గుర్తు చేశారు.

Continues below advertisement


యుఏఈలో యూఏఈ అభివృద్ధిలో భారతీయులదే కీలక పాత్ర


యూఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. యుఏఈ ప్రజలు మనసులో చొటివ్వడం కాకుండా...కష్టసుఖాలను పాలు పంచుకున్నారని గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలో యుఏఈలో ఉన్న భారతీయులను...స్వదేశానికి తీసుకురావాలని భావించామన్నారు. ఇదే విషయం అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడితే...భారతీయుల విషయంలో ఆందోళన చెందవద్దంటూ హమీ ఇచ్చారని వెల్లడించారు. యుఏఈలోని భారతీయులందరికి అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అండగా నిలిచారని...అందరికి వ్యాక్సిన్ ఇప్పించారని అన్నారు. 2015లో హిందూ ఆలయం కడతామని ప్రతిపాదన చేస్తే...ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా స్థలం ఇచ్చారని వెల్లడించారు. హిందూ దేవాలయం ప్రజలకు అంకితం చేసే ఆసన్నమైందన్నారు. 


భారత్-యుఏఈ మైత్రి మరింత బలపడుతుంది


21వ శతాబ్దంలో భారత్-యుఏఈ మైత్రి మరింత బలపడుతుందని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. టాలెంట్, ఇన్నోవేషన్, కల్చర్ లోనూ...కలిసి ఉన్నామని... భవిష్యత్ లో కలిసి ముందుకు సాగుతామన్నారు. భారత్ లో పెట్టుబడులు పెట్టడంలో యుఏఈ ఏడో స్థానంలో ఉందన్నారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ లో భారత్- యుఏఈ కలిసి పని చేస్తాయన్నారు. రెండు దేశాల మధ్య దగ్గర సంబంధాలు ఉన్నాయన్న ఆయన...సంబంధాలు మరింత బలపడుతున్నాయని వెల్లడించారు. ఇక్కడున్న భారతీయులను చూసి దేశం గర్విస్తోందని అన్నారు. సీబీఎస్ఈ సిలబస్ తో నడిచే స్కూళ్లను ప్రారంభించారని...ఉన్నత చదివే విద్యార్థులకు యుఏఈ సహాయం అందిస్తోందన్నారు. అత్యంత వేగంగా డెవలప్మెంట్ జరుగుతున్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉందన్నారు.