ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ప్రదేశాలు ఎక్కడికి వెళ్తాయి? ఎపుడైనా చూడొచ్చులే అని చూడటాన్ని వాయిదా వేస్తుంటాం. కానీ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి అయినా, మానవ నిర్మితాలయినా, కొన్నేళ్ల తరువాత రూపు రేఖలు మారిపోతాయి. అందుకు కారణం వాతావరణ విపత్తులు కావొచ్చు లేదా విపరీతమైన ఆధునికీకరణ వల్ల కావొచ్చు. అవి శిథిలమవక ముందే, ఒకసారి వెళ్లి చూడకపోతే ఇకెప్పటికీ మనకు కనిపించకపోవచ్చు.
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా(Great Wall of China)
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా.. మంగోలియన్ల(Mongolians) నుంచి, అలాగే ఇతర చొరబాటుదారుల నుంచి దేశాన్ని రక్షించుకోవటానికి 3000 సంవత్సరాల క్రితం చైనా(China) నిర్మించుకుంది. 12,427 మైళ్ల పొడవున్న ఈ గోడ ఇప్పటికీ ప్రపంచపు అద్భుతాల్లో ఒకటి.
అయితే, తుఫాను, హోరుగాలులు వంటి ప్రకృతి విపత్తులకు ఈ గోడ నిలువలేకపోవచ్చు. దానికి తోడు యేటా ఇక్కడికి మిలియన్ల మంది యాత్రికులు వస్తుంటారు. అందువల్ల కూడా ఈ కట్టడం శిథిలమయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఏడాది పొడవునా దీని రక్షణ చూసుకోవటానికి అక్కడ తగిన ఏర్పాట్లు ఉన్నాయి.
అంటార్కిటికా పూర్తిగా కనుమరుగైపోవచ్చు!
ఒక ప్రాంతం జీవన ప్రమాణం అక్కడి పర్యావరణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. అయితే విపరీతమైన గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణం పూర్తిగా దెబ్బతింటోంది. అంటార్కిటికా(Antarctica) బయో డైవర్సిటీ పాడయిపోయి, యేటా మంచు ప్రాంతాల్లో నివసించే జీవులు, పెంగ్విన్లు, పోలార్ ఎలుగుబంట్లు అంతరించిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు మంచు కరిగిపోయి, ఆ నీరంతా సముద్రాల్లో కలిసి దగ్గరున్న ఐలాండ్లలో సునామీలకు కారణమవుతున్నాయి.
తాజ్ మహల్ కళ తప్పుతోంది
ఇండియాలో ప్రముఖ దర్శనీయ ప్రదేశం తాజ్ మహల్(Taj Mahal). షాజహాన్ 1653 లో కట్టించిన ఈ కట్టడం ప్రపంచంలోని ఎన్నో కట్టడాల్లోకెల్లా ప్రతిష్టాత్మకమైనది. ఇవోరీ వైట్ మార్బుల్ తో నిర్మించిన ఈ కట్టడం పొద్దున సూర్యకాంతి టైంలో ఒకలా, రాత్రి ఒకలా రంగు మారుతుంటుంది. అయితే పొల్యూషన్ వల్ల, యాత్రికుల రద్దీ వల్ల ఈ మార్బుల్ కళ తప్పిపోతోంది. పక్కనున్న నది అధిక వేడి వల్ల ఎండిపోతోంది. చుట్టు పక్కన ప్రాంతాల ప్రజల స్వచ్ఛమైన గాలి లేక ఇబ్బంది పడుతున్నారు.
ది గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గీజా ఒక గట్టి గాలివానకు కూలిపోవచ్చు
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఈజిప్టుల ది గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గీజా(The Great Pyramid of Giza) ఇక మిగిలివున్న ఆఖరి కట్టడం. జీవితంలో ఒక్కసారైనా ఈ పిరమిడ్ ను చూడాలని ఎంతో మంది కల. ఇది నిర్మించటానికి 20 యేళ్లు పట్టింది. ఎడారి ప్రాంతం అవటం మూలానే ఈ కట్టడం ఇప్పటికే ఎన్నో సుడిగుండాలు, భూకంపాలను తట్టుకుంది. కానీ చాలా వరకు ఛిద్రమైపోయింది. భవిష్యత్తులో వచ్చే తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల ఈ కట్టడం పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది. ఇది గుర్తించి, రక్షణ కల్పించే ఏర్పాట్లు చేయకపోతే, ఇంత గొప్ప కట్టడం ఇక చరిత్రలో మిగలక పోవచ్చు.
మునిగిపోతున్న వెనీస్ నగరం(The city of Venice)
ఇటలీ(Italy)లోని వెనీస్ ఎంతో అందమైన నగరం. చుట్టుపక్కన చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. సముద్రజలాలు పెరిగిపోతుండటంతో ఏటా ఈ నగరంలో 100 సార్లు సునామీలు వస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే ఈ నగరం మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉంది.