Viral Video:
మధ్యలో ఆగిన రోలర్‌కోస్టర్
రోలర్‌కోస్టర్ ఎక్కడం వరకూ సరదాగానే ఉంటుంది. ఎక్కిన తరవాతే అసలు కథ మొదలవుతుంది. అందుకే కొంతమంది కింది నుంచి చూసి ఎంజాయ్ చేస్తారే తప్ప పొరపాటున కూడా ఎక్కరు. అంత అడ్వెంచరస్‌గా ఉంటుందీ రైడ్. ఒక్కోసారి పట్టుతప్పి ప్రమాదాలూ జరుగుతుంటాయి. ఇంగ్లాండ్‌లో ఇటీవల అదే జరిగింది. అడ్వెంచర్ ఐల్యాండ్ (Adventure Island)లో 72 అడుగుల ఎత్తైన రోలర్‌కోస్టర్‌ని ఎక్కారు కొందరు. కొంత సేపటి వరకూ రైడ్ బాగానే సాగినా ఉన్నట్టుండి మధ్యలో ఆగిపోయింది. అంత ఎత్తులో ఆగిపోతే గుండెలు అదిరిపోవూ..! ఎందుకిలా ఆగిపోయిందో అర్థం కాక వణికిపోయారు అందులో ఉన్న వాళ్లంతా. నానా తంటాలు పడి మొత్తానికి వాళ్లందరినీ కిందకు సురక్షితంగా తీసుకొచ్చారు. కానీ...ఆ ఎక్స్‌పీరియెన్స్ మాత్రం వాళ్లు లైఫ్‌లో మర్చిపోలేరు. ప్రత్యక్ష సాక్ష్యులు కొందరు ఇది ఎలా జరిగిందో వివరించారు.
"చాలా ఎగ్జైటింగ్‌గా అందరూ రోలర్ కోస్టర్ ఎక్కారు. కాసేపు లూప్‌లో అటూ ఇటూ ఊగారు. పైకి వెళ్లగానే ఒక్కసారిగా ఆగిపోయింది. అది ఎందుకలా స్ట్రక్ అయిందో మాకు అర్థం కాలేదు. అందరూ గట్టికా కేకలు పెట్టారు. నిలువునా ఉన్నప్పుడు స్ట్రక్ అవడం వల్ల కింద పడిపోతారేమో అని భయం వేసింది. దాదాపు 45 నిముషాల పాటు వాళ్లు అలాగే ఉండిపోయారు. అదృష్టం ఏంటంటే..ఇక్కడి నిర్వాహకులు వెంటనే స్పందించి వాళ్లు ప్యానిక్ అవ్వకుండా జాగ్రత్తగా కిందకు దించారు. ఏ కాస్త అటు ఇటైనా వాళ్ల ప్రాణాలకే ప్రమాదం ఉండేది"
- ప్రత్యక్ష సాక్షి