Viral Video: 



టెక్సాస్‌లో ప్రమాదం..


అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర ప్రమాదం (Texas Aircraft Crash Video) జరిగింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న విమానం అదుపు తప్పి కార్‌పై దూసుకెళ్లింది. నవంబర్ 13న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. టెక్సాస్‌లోని మిడ్‌లాండ్‌ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్‌క్రాఫ్ట్‌ని కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఓ ఎయిర్‌పోర్ట్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే...రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఉన్నట్టుండి అదుపు తప్పింది. Aero County Airport వద్ద ఈ ప్రమాదం జరిగింది. రన్‌వేపై ఆగాల్సి ఉన్నా అది ఆగలేదు. ఎదురుగా వస్తున్న కార్‌పైకి దూసుకుపోయింది. కార్‌ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లోని ఇద్దరికి, కార్‌లో ఒకరికి గాయాలయ్యాయి. మెడికల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రత్యక్ష సాక్ష్యులు ఈ వీడియో తీశారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ అదుపు తప్పిందని తెలుసుకున్న వెంటనే ఆ విజువల్స్‌ని ఫోన్‌లో రికార్డ్ చేశారు. చాలా వేగంగా వచ్చి రన్‌వేని ఢీకొట్టినట్టు చెబుతున్నారు. విమానం దిగిన తీరుని చూసే అది సరైన విధంగా ల్యాండ్ అవ్వదని ఊహించినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టనున్నారు. Federal Aviation Administration (FAA) రంగంలోకి దిగి విచారణ చేపట్టనుంది. ప్రమాదానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. విచారణ చేపట్టిన తరవాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. బాధితులు ముగ్గురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 







కెనడాలో ఇటీవల ఘోర ప్రమాదం జరిగింది. బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఓ విమానం కుప్ప కూలి ఇద్దరు ట్రైనీ పైలట్‌లు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లిద్దరూ భారతీయులే. ముంబయికి చెందిన యశ్ విజయ్ రాముగడే, అభయ్ గద్రూ కెనడాలో పైలట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్లేన్ క్రాష్ అయింది. లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ Piper PA-34 Seneca ఒక్కసారిగా అదుపు తప్పి పొదల్లో కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ట్రైనీ పైలట్‌లతో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయినట్టు కెనడా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో స్థానికులెవరూ గాయపడలేదని తెలిపారు. అయితే...ఈ ప్రమాదానికి కారణమేంటో ఇంకా తెలియలేదు. Transportation Safety Board of Canada అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు. ఘటనా స్థలానికి 5 ఆంబులెన్స్‌లు చేరుకున్నాయి. పారామెడికల్ సిబ్బంది కూడా అందుబాటులోకి వచ్చింది. The Piper PA-34 ఫ్లైట్‌ని 1972లో తయారు చేశారు. 2019లో రిజిస్టర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Also Read: Gaza News: గాజాలోని హాస్పిటల్‌లో చిన్నారుల నరకయాతన, కుళ్లిన శవాల మధ్యే వేలాది మంది