Israeli Defence Forces Videos:
వైరల్ వీడియో..
అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయేల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడులు ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్‌పై ఇజ్రాయేల్ సైన్యం ప్రతిదాడులు చేస్తోంది. వాళ్లని వెంటాడి మరీ మట్టుబెడుతోంది. ఈ క్రమంలోనే కొన్ని వీడియోలు విడుదల చేస్తూ వస్తోంది ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( Israel Defense Forces).ఈ క్రమంలోనే ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదుల్ని ఎలా వెంటాడి మట్టుబెట్టారో ఈ వీడియోలో చాలా క్లియర్‌గా కనిపించింది. టెర్రరిస్ట్‌లు దాడులు చేసి ఓ కార్‌లో అక్కడి నుంచి పరారవుతుండగా ఇజ్రాయేల్ సైన్యం నిఘా పెట్టింది. నేరుగా ఆ కార్ డ్రైవర్‌కి తుపాకీ గురి పెట్టి కాల్చింది. వెంటనే ఆ కార్ ఎదురుగా ఉన్న ఓ పోల్‌ని ఢీకొట్టి క్రాష్ అయింది. తరవాత కార్‌లో వెనకాల కూర్చున్న ఉగ్రవాదులు బయటకు పరిగెత్తారు. ఇజ్రాయేల్ సైనికులు వాళ్లని వెంటాడారు. వాళ్లకు చిక్కకుండా ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే...వాళ్లను సైనికులు మట్టుబెట్టారా లేదా అన్నది వీడియోలో కనిపించలేదు. ఈ కాల్పులతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇది గమనించిన సైనికులు వాళ్లను సురక్షితంగా వేరే చోటకు చేర్చారు. గాజా సరిహద్దుకి దగ్గర్లోని కిబ్బుట్జ్ ప్రాంతంపైనే ఉగ్రవాదులు ఎక్కువగా దాడులు చేశారు. అక్టోబర్ 7వ తేదీన ముందుగా దాడి చేసింది ఇక్కడే. ఈ ప్రాంతంలోని ప్రజలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం వల్ల వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇక్కడ 108 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే...ఈ ప్రాంతంపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది ఇజ్రాయేల్ సైన్యం.