Who is Usha Chilukuri Vance: ఈ ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగాడొనాల్డ్ ట్రంప్(Donald Trump)  బరిలో ఉన్నారు. ఆయన తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ప్రకటించటంతో తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చ మొదలైంది. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్(JD Vance) పేరును ట్రంప్ అనౌన్స్ చేశారు. అయితే ట్రంప్ నిర్ణయం వెనుక పెద్ద ప్లానే ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓహియో స్టేట్‌కు సెనేటర్‌గా ఉన్న జేడీ వాన్స్ శ్వేతజాతీయుడు. ఆయన భార్య ఉషా చిలుకూరి వాన్స్(Usha Chilukuri Vance) భారతీయ మూలాలన్న తెలుగు సంతతి విమెన్. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్లి సెటిల్ అయ్యారు. 



ఇండియన్ ఓట్ల కోసం తాపత్రయం


ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డెమాక్రాట్ అభ్యర్థి జో బైడెన్ తన డిప్యూటీగా భారతీయ సంతతి మహిళ, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌నే కొనసాగించే అవకాశాలు కనపడుతున్నాయి. అమెరికాలో విజయవకాశాలను ప్రభావితం చేసేది మాత్రం అసంఖ్యాకంగా ఉన్న భారతీయ సంతతి వ్యక్తులను, ప్రవాస భారతీయులే. అందుకే వారిని  ఆకర్షించటానికి డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తెగ ఆయాసపడుతున్నారు. 


ట్రంప్ బిగ్ మూవ్


అదే బాటలో ఉన్న ట్రంప్ కూడా శ్వేతజాతీయులను, భారతీయ మూలాలున్న వారిని ఆకర్షించేలా జేడీ వాన్స్ పేరు ప్రకటించారని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని బలంగా వినిపించే ట్రంప్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు తమ పార్టీలో ఉన్నా వారెవరినీ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా ప్రకటించకుండా ఇలా అభ్యర్థి భార్య భారత సంతతికి చెందిన వ్యక్తి అయ్యి ఉండేలా వ్యూహాత్మక ఎత్తుగడ వేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. 


ఎవరీ ఉషా?


ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఉషా పూర్వీకులు ఎవరు వాళ్ల కుటుంబనేపథ్యం ఏంటీ లాంటి విషయాలు ప్రస్తుతానికి పెద్దగా బయటకు రాలేదు. చాలా ఏళ్ల క్రితమే వాళ్ల కుటుంబం అమెరికాకు వెళ్లిపోయి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవటంతో ఉషా చిలుకూరి గురించి పూర్తి వివరాలు బాహ్య ప్రపంచానికి తెలియటానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.  కానీ ఉషా చిలుకూరి ఇంటి పేరు మీదుగా ఆ కులం ఏమై ఉంటుందో అన్న చర్చ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ఉషా చిలుకూరి ఇంటి పేరు కారణంగా ఆమె కులం ఫలానా అయ్యింటుందని ఎవరికి వారు తమ అభిప్రాయాలను ఎక్స్(X) లో వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె కమ్మ సామాజిక వర్గం లేదా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారనే డిబేట్ ఎక్స్‌లో నడుస్తోంది. ఎవరికి తోచిన రీతిలో వారు అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. చిలుకూరి అనే ఇంటి పేరు కమ్మ, బ్రాహ్మణ రెండు సామాజిక వర్గాల్లోనూ ఉండటమే ఈ కన్ఫ్జూజన్ కి కారణంగా కనిపిస్తోంది. 




ఉషా కులపై చర్చ


ఉషా తల్లితండ్రులు అమెరికాలోనే ప్రొఫెసర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉషా న్యాయవిద్యను పూర్తి చేసి సుప్రీంకోర్టులో లా కర్క్‌గా పనిచేశారు. సో వీరి కుటుంబం 30-40 ఏళ్ల క్రితమే అమెరికాకు వెళ్లిన కుటుంబం అయ్యి ఉంటుందని ఆ సమయంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారని కనుక ఆమె కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయ్యి ఉంటుందని ఐస్ లాషో అనే యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి మద్దతుగా మరికొంత మంది ఆమె కమ్మసామాజిక వర్గానికి చెందిన మహిళ అంటూ కామెంట్స్ పెట్టారు. 




మరికొంత మంది దీన్ని విబేధిస్తున్నారు. ఆమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళ అని కొంత మంది పోస్టులు పెడుతున్నారు. ఈ చర్చ ఇప్పుడే కాదు జేడీ వాన్స్ తన జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఓ పుస్తకాన్ని రాసుకున్నారు. ఆ పుస్తకం ఆధారంగా Hillbilly Elegy అనే సినిమాను 2020లో నెట్ ఫ్లిక్స్(Netflix) తీసింది. స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన భారత సంతతి నటి ఫ్రీదా పింటో ఆ సినిమాలో ఉషా చిలుకూరి పాత్రను పోషించారు. అప్పుడు కూడా ఎవరీ ఉషా చిలుకూరి అనే చర్చ నడిచింది. అప్పుడు రజీన్ ఖాన్ ఓ సోషల్ మీడియా యూజర్ తన పోస్ట్‌లో తనకు జేడీ వాన్స్ పర్సనల్‌గా తెలుసని ఉషా చిలుకూరి భారతీయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళని తనకు వాన్స్ చెప్పాడని పేర్కొన్నారు. ఇలా అమెరికా ఉపాధ్యక్ష పదవికి బరిలో ఉన్న జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్ ది ఏ కులం అనే డిబేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.




Also Read: US ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ సతీమణి తెలుగింటి అమ్మాయే - ఎవరీ ఉష చిలుకూరి?


Also Read: డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం- ఉపాధ్యక్ష అభ్యర్థిగా జె.డి.వేన్స్‌