US terrorist attacks causing tensions : అమెరికాలో న్యూ ఇయర్ రోజు వరుసగా జరిగిన మూడు ఉగ్రదాడులు సంచలనం రేపుతున్నాయి. అవి మామూలు ఘటనలు అనుకున్నారు కానీ... ఉగ్రదాడులని ఎఫ్‌బీఐ గట్టిగా అనుమానిస్తోంది.  నూతన సంవత్సరం రోజు మూడు ఉగ్రదాడులు జరిగాయి. ఇది చిన్న విషయం కాదు.  ఒకటి న్యూ ఆర్లిన్స్‌లో, ఇంకొకటి  ఓ నైట్ క్లబ్‌లో జరగగా మూడోది ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ముందు జరిగింది. ఈ దాడులు చేసిన వారందరూ ఒకరికి ఒకరు తెలుసని అనుమానిస్తున్నారు. 


ట్రక్కుతో తొక్కేసి కాల్పులు జరిపి ! 


అమెరికాలోని లుసియానా రాష్ట్రం న్యూ ఓర్లిన్స్‌లో  నూతన సంవత్సర వేడుకలు జరుపుతున్న బౌర్బోన్ స్ట్రీట్‌లో భారీగా గుమిగూడిన ప్రజల మీదుగా ట్రక్ నడిపించాడు. తర్వాత కిందకు దిగి కాల్పులు జరిపాడు. పదిహేను మందిని చంపిన తర్వాత పోలీసులు కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. దుండగుడు టెక్సాస్‌కు చెందిన షంషుద్దీన్‌ జబ్బార్‌గా గుర్తించారు. అతను అమెరికా పౌరుడే. మాజీ సైనికుడని చెబుతున్నారు.  ఈ ఘటనపై ఉగ్రకోణం చర్యలో దర్యాప్తు చేసిన ఎఫ్‌బీఐ ఈ దాడి వెనుక మరికొంతమంది హస్తం ఉన్నట్లు అనుమానిస్తోంది. దుండగుడి వాహనంలో ఐసీసీ ఉగ్రవాద జెండా లభించడంతో ఈ కోణంలో కూడా దర్యాప్తు సంస్థ జరుపుతోంది. 


Also Read:  బురఖా ధరించడంపై నిషేధం, అతిక్రమించిన వారికి భారీగా జరిమానాలు- జనవరి 1నుంచి అమలు


లాస్ వేగాస్‌లో సైబర్ ట్రక్‌లో పేలుడు 


లాస్ వేగాస్ లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ముందు ఓ టెస్లా కారు పార్క్ చేసి ఉంది.  కాసేపటికి అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. ట్రక్‌ను అద్దెకు తీసుకుని ఆ కారులో ఉన్న వ్యక్తి చనిపోయాడు. టెస్లా కారు చాలా స్ట్రాంగ్ కాబట్టి.. ఆ బాంబుల వల్ల అక్కడ పెద్దగా నష్టం జరగలేదు.  అయితే బ్యాటరీ పేలిపోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ ఉగ్రదాడి అని తర్వాత అందరికీ ఓ అభిప్రాయం ఏర్పడింది. న్యూ ఆర్లిన్స్ లో దాడులకు పాల్పడిన వక్తికి..  టెస్లా కారులో బాంబులు పెట్టేసి పేల్చేసుకున్న వ్యక్తికి సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు.  ఇద్దరూ మాజీ సైనికులే. ఒద్దరూ ఒకే రెంటల్ ఏజెన్సీలో కార్లను తీసుకుని వెళ్లారు. అదే కార్లతో ఈ దురాగతానికి పాల్పడ్డారు.


ట్రంప్ విద్వేష రాజకీయాలే కారణమా ? 


మరో వైపు న్యూయార్క్ నైట్ క్లబ్‌లో ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో పదిహేను మంది గాయపడ్డారు. ఇది కూడా ఉగ్రదాడిగానే అనుమానిస్తున్నారు. ట్రంప్ తన ఎన్నికల  ప్రచారం విద్వేష కాన్సెప్ట్ ను ఎక్కువగా ఉపయోగించుకోవడంతో ఆయనపై చాలా సార్లు హత్యాయత్నాలు జరిగాయి. వలస వచ్చిన వాళ్లు అని ఇతర దేశాల వారిని అవమానించారు.  ఇస్లామోఫోబియాను పెంచారన్న ఆరోపణలు ఉన్నాయి. ట్రక్ తో పదిహేను మందిని చంపిన ఉగ్రవాది కారులో ఐసిస్ జెండా లభించడంతో  ఖచ్చితంగా ఇది ఉగ్రకోణమేనని నిర్దారణకు వచ్చారు. అంటే ఐసిస్  అమెరికాలో కూడా తన నెట్ వర్క్ ను విస్తరించిందా లేకపోతే ఐసిస్ కు ఏకలవ్య శిష్యులుగా మారి సొంత దేశంలో కొంత మంది దాడి చేస్తున్నారా అన్నది సస్పెన్స్‌గా మారింది. 


కారణం ఏదైనా ఇప్పుడు ఇలా ప్రారంభమైన ఉగ్రదాడులు ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది మాత్రం అగ్రరాజ్యంలో ఆందోళనకు కారణం అవుతోంది.