Donald Trump Tariffs: ప్రతికార సుంకాల పేరుతో ప్రపంచాన్ని షేక్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరాలోచనలో పడ్డాడు. వివిధ దేశాలతో చర్చించిన అనంతరం నిర్ణయాన్ని మరో మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మినహాయింపు చైనాకు మాత్రం వర్తించదని వైట్‌హౌస్ ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాన్ని గురించి ప్రకటించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. అన్ని దేశాలలో స్టాక్ మార్కెట్‌లు భారీగా నష్టపోయాయి. వివిధ దేశాల నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు ట్రంప్ బుధవారం (ఏప్రిల్ 9, 2025) సుంకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. చైనా మినహా 75 కి పైగా దేశాలకు ఆయన పెద్ద ఉపశమనం కల్పించారు. చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై తక్షణమే 125 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
చైనాపై సుంకం 125% కి పెరిగిందిచైనా ప్రపంచ మార్కెట్ల పట్ల గౌరవం చూపడం లేదని, దీని కారణంగా చైనాపై అమెరికా విధించిన 104 శాతం సుంకాన్ని 125 శాతానికి పెంచుతోందని, ఇది వెంటనే అమలులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్ట్ చేస్తూ, అమెరికా సహా ఇతర దేశాలను దోచుకోలేనని చైనా భవిష్యత్‌లో తెలుసుకుంటుదని ట్రంప్ అన్నారు.
75 కి పైగా దేశాలకు ఉపశమనం డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని 7కి పైగా దేశాలకు 90 రోజుల సుంకం మినహాయింపును ప్రకటించారు. ఈ దేశాలు వాణిజ్యం, కరెన్సీ మానిప్యులేషన్ వంటి అంశాలపై అమెరికా వాణిజ్య శాఖ, ట్రెజరీ, USTR తో చర్చలు ప్రారంభించాయని ట్రంప్ అన్నారు. ఈ దేశాలతో వాణిజ్యంపై రాబోయే 90 రోజుల పాటు 10 శాతం పరస్పర సుంకం మాత్రమే విధిస్తామని తెలిపారు.
చైనా 84% ప్రతికార సుంకం అమెరికా నిన్న (8 ఏప్రిల్ 2025) చైనాపై 104 శాతం సుంకం విధించింది. దీనికి చైనా కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యింది. బుధవారం (9 ఏప్రిల్) చైనా కూడా అమెరికాపై 84 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ అదనపు సుంకాలు ఏప్రిల్ 10 నుంచి అమెరికన్ వస్తువులపై వర్తిస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా 12 అమెరికన్ సంస్థలను తన ఎగుమతి నియంత్రణ జాబితాలో ఉంచడం ద్వారా అమెరికాకు ప్రతిస్పందించింది.