US President Donald Trump : ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నారో మాకు బాగా తెలుసు అని ఆయన అన్నారు. ట్రంప్ ఖమేనీని హెచ్చరికలు జారీ చేశారు. ఆయన మాకు చాలా సులభమైన లక్ష్యం అని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఇలా రాశారు, 'ఇరాన్ సుప్రీం లీడర్ అని పిలవబడే వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో మాకు బాగా తెలుసు. ఆయన మాకు చాలా సులభమైన లక్ష్యం, కానీ ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నారు ఎందుకంటే మేము ఇప్పుడే ఆయనను చంపాలనుకోవడం లేదు.'
"సుప్రీం లీడర్" అని పిలుచుకునే వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు. ఆయన సులభమైన లక్ష్యం, కానీ ఆయన సురక్షితంగా ఉన్నాడు. మేము ఆయన్ని బయటకు తీసుకురావడం లేదు(చంపబోవడం లేదు అని అర్థం వచ్చేలా!), పౌరులు లేదా అమెరికన్ సైనికులపై క్షిపణులు ప్రయోగించకూడదని కోరుకుంటున్నాము. మా ఓపిక సన్నగిల్లుతోంది. ఈ విషయంలో మీ శ్రద్ధకు ధన్యవాదాలు!" ఆయన రాశారు.
మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై అమెరికా సైనిక ఆధిపత్యం గురించి ఈ ప్రకటన చేస్తూ ఇస్లామిక్ రిపబ్లిక్ గగనతలంపై అమెరికా "పూర్తి నియంత్రణ"ను ఏర్పరచుకుందని చెప్పారు. ట్రూత్ సోషల్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో ఇరాన్ బలమైన రక్షణ సామర్థ్యాలు కలిగి ఉన్నప్పటికీ, అవి అమెరికన్ సాంకేతికతకు సరిపోవని ట్రంప్ ప్రకటించారు.
"ఇరాన్ వద్ద మంచి స్కై ట్రాకర్లు, ఇతర రక్షణ పరికరాలు ఉన్నాయి, కానీ అమెరికన్ తయారు చేసిన 'వస్తువు'తో పోల్చలేం. USA కంటే ఎవరూ దీన్ని బాగా తయారు చేయరు" అని ట్రంప్ పోస్ట్ చేశారు. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఉన్న ప్రాంతం గురించి మాట్లాడుతూ US వద్ద పూర్తి సమాచారం ఉందని పేర్కొన్నారు. కానీ "ఇప్పుడు" అతన్ని లక్ష్యంగా చేసుకోకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇదే వేదికపై మరో పోస్ట్‌లో, ట్రంప్ ఇరాన్ "బేషరతుగా లొంగిపోవాలని" పిలుపునిచ్చారు!
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విధానం, దాని చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యానాలను బహిరంగంగా ప్రస్తావించారు, దీనిని ఆయన ఇన్నర్ దృక్పథంగా పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఏం పోస్టులో "చూడండి, నేను దీన్ని చాలా లోతుల నుంచి చూస్తున్నాను . మా అధ్యక్షుడు పట్ల పక్షపాతంతో ఉన్నానని అంగీకరించాను, కానీ సోషల్ మీడియాలో చాలా పిచ్చి విషయాలు ఉన్నాయి, కాబట్టి నేను ఇరాన్ సమస్యపై కొన్ని విషయాలను నేరుగా ప్రస్తావించాలనుకుంటున్నాను" అని వాన్స్ రాశారు.
ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించడానికి అనుమతించకూడదని అధ్యక్షుడు ట్రంప్ ఒక దశాబ్ద కాలంగా స్థిరమైన వైఖరిని కొనసాగిస్తున్నారని వాన్స్ నొక్కి చెప్పారు. ఈ లక్ష్యాన్ని నిర్ధారించడానికి టెహ్రాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని అధ్యక్షుడు ఇటీవలి నెలల్లో తన విదేశాంగ విధాన బృందాన్ని కోరారని ఆయన వెల్లడించారు.
"ఇరాన్ యురేనియం సేకరించకూడదని అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇది ప్రమాదకరమని ఆయన పదే పదే చెప్పారు" అని వాన్స్ అన్నారు. ట్రంప్ పరిపాలన దౌత్య మార్గాన్ని కోరిందని, కానీ ఆఫర్లను ఇరాన్ తిరస్కరించిందని ఆయన అన్నారు. పౌర అణుశక్తి- యురేనియం సంపాదించడం మధ్య వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తూ, ఇరాన్ సైనికేతర ప్రయోజనాలకు అవసరమైన దానికంటే ఎక్కువగా దూరం వెళ్తోందని వాన్స్ ఆరోపించారు.