Russia Sanctions Bill: భారత్‌పై మరోసారి అమెరికా సుంకాల కత్తి వేలాడుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. అమెరికా ప్రతినిధుల సభ రష్యాపై ఆంక్షల బిల్లును 262-159 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ బిల్లు.. రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే ఐదు అగ్ర దేశాలపై 100% వరకు సుంకాలు విధించే అధికారాన్ని ట్రంప్ ప్రభుత్వానికి కల్పిస్తుంది. అధికారికంగా 'లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026'గా పిలిచే ఈ బిల్లు చైనా, స్లోవేకియా, హంగరీ, అజర్‌బైజాన్‌లను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బిల్లుకు సెనేట్‌లో భారీ మెజారిటీ లభించింది. అంటే ఇప్పుడు ఇది చట్టంగా మారడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం ఆయన వద్దకు వెళ్లనుంది.  

Continues below advertisement

మధ్యంతర ఎన్నికల వేళ 

మెజారిటీ రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఈ వివాదాస్పద బిల్లును ఓటింగ్‌కు తీసుకురావడంతో.. ఆమోదం పొందింది. నవంబర్‌లో జరగబోయే కీలక మధ్యంతర ఎన్నికలకు ముందు, సుంకాలు విధించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు మరింత అధికారం ఇవ్వడంపై రిపబ్లికన్, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయి.  కేవలం వారం క్రితం వరకు ఈ బిల్లుపై ఏ నిర్ణయం తీసుకోలేదు. సోమవారం హౌస్ రూల్స్ కమిటీ ఒక కీలకమైన అడ్డంకిని తొలగించి, ఈ బిల్లును ఓటింగ్‌కు తీసుకొచ్చింది. ఈ వారం బిల్లు ఆమోదం దిశగా వేగంగా ముందుకు కదిలింది. మంగళవారం ఇద్దరు డెమోక్రటిక్ చట్టసభ్యులు రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా ఓటు వేయడంతో, ఆంక్షల బిల్లుపై బుధవారం ఫైనల్ ఓటింగ్‌కు 214-211 స్వల్ప తేడాతో ఆమోదం తెలిపింది. 

Also Read: మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?

Continues below advertisement

యూరోపియన్ దేశాలకు మినహాయింపు

వాస్తవానికి రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ను ఈ చట్టం విస్తృత అధికారులు కట్టబెట్టనుంది. అంతేకాకుండా, అమెరికా.. మిత్రదేశాలైన  యూరోపియన్ కంట్రీస్‌కు ఇవి  మినహాయింపు ఇస్తాయి. ఎందుకంటే ఆ దేశాలలో చాలా వరకు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని అమెరికా చెప్పుకొస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందడంలో ట్రంప్ వైట్ హౌస్ పాత్ర అస్పష్టంగానే ఉంది. అమెరికా కమాండర్-ఇన్-చీఫ్‌కు సుంకాల అధికారాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు కోరినప్పటికీ, ఈ బిల్లుకు అధ్యక్షుడు ట్రంప్ మద్దతు అంతమాత్రంగానే ఉందని గత నెలలో యూఎస్ రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీకి చెందిన సభ్యులను ఈ చట్టానికి అనుకూలంగా ఓటు వేసేలా చేయడం ద్వారా, ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లడంలో వైట్ హౌస్ కీలక పాత్ర పోషించి ఉండొచ్చని యూఎస్ మీడియాలోని నివేదికలు చెబుతున్నాయి.  Also Read: 241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

భారత్ వైఖరి 

భారత్ ఇంధనాన్ని సమకూర్చుకునే విషయం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. రష్యా ఆంక్షల బిల్లుకు సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విధంగా స్పందించారు. 

Also Read: బ్రిక్స్ వేదికగా భారత్ గ్లోబల్ సౌత్ గొంతుకగా, లీడర్‌గా ఎలా మారుతోంది ?