America Latest news: ప్రపంచాన్నే గడగడలాడించిన భయంకర తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన అమెరికన్ సైనికుడు ఇప్పుడు అదే అమెరికా సైనికులకు గంజాయి అమ్ముతున్నాడు అని తెలిస్తే ఆశ్చర్యం అనిపించక మానదు. రాబర్ట్ ఓ నీల్ అల్‌ఖైదా తీవ్రవాది బిలన్ లాడెన్ ఒంట్లో బుల్లెట్స్ దించిన సైనికుడు. చాలాకాలం తన పేరు తను బయటకు రాకుండా అమెరికా జాగ్రత్త పడింది. తన భద్రత రీత్యా చాలాకాలం రాబర్ట్ వివరాలను రహస్యంగానే ఉంచింది. లాడిన్ చనిపోయి దశాబ్దం దాటిపోవడంతో రాబర్ట్ పేరు నెమ్మదిగా బయటికి వచ్చింది.
కొంతకాలం పాటు మోటివేషనల్ స్పీకర్‌గా కూడా పనిచేసిన రాబర్ట్ ఓ నీల్ ఇప్పుడు ఒక రకమైన గంజాయిని అమ్మడానికి లైసెన్స్ తీసుకున్నాడు. అమెరికాకు చెందిన న్యూ యార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్ స్వయంగా ఈ విషయాన్ని పేర్కొన్నాడు. అమెరికా సైనికులకు "పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ " అనేది ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. యుద్ధపరంగా విపరీతమైన ఒత్తిడిని వారు ఎదుర్కొంటూ ఉంటారు. సైన్యంలో ఉన్న సమయంలో గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడంపై కఠిన నిషేధం ఉంటుంది. వారు రిటైర్ అయిన తర్వాత ఆ స్ట్రెస్‌తోనే జీవితం గడపాల్సి వస్తోంది. ఆ ఒత్తుళ్లతో కొన్నిసార్లు విపరీత నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు.
ఇలాంటి పరిణామాలు గమనించిన రాబర్ట్ గంజాయి వ్యాపారం మొదలు పెట్టాడు. మైల్డ్ డోసు ఉన్న గంజాయిని ఇవ్వడం ద్వారా సైనికులను స్ట్రెస్ నుంచి బయట పడేయవచ్చు అంటూ ఈ వ్యాపారంలోకి దిగాడు. "ఆపరేటర్ కానా కో " పేరుతో ఓన్ బ్రాండ్ మార్కెట్‌లో ప్రవేశ పెట్టాడు. తాను సైన్యం నుంచి బయటకు వచ్చాక అ స్ట్రెస్ నుంచి మైల్డ్ డోస్‌లో గంజాయి వాడి బయటపడినట్టు ఇంటర్యూలో పేర్కొన్నాడు. ఇక ఈ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని వికలాంగులుగా మారిన మాజీ సైనికుల సంక్షేమం కోసం ఖర్చు పెడతానని రాబర్ట్ అంటున్నాడు.
Also Read: ఆకాశం నుంచి ఊడిపడబోతున్నసిటీ కిల్లర్ - ఓ నగరం మొత్తం భూస్థాపితం ఖాయం - ఇంతకీ ఏమిటో తెలుసా ?
బిన్ లాడెన్ మమల్ని చంపేస్తాడు అనుకున్నాం : రాబర్ట్
పాకిస్తాన్‌లోని అబొట్టాబాదులోని ఒక బిల్డింగ్‌లో తలదాచుకుంటున్న ఒసామా బిన్ లాడెన్‌ను చంపడానికి వెళ్లిన అమెరికన్ నేవీ సీల్ "టీమ్ 6"లో రాబర్ట్ ఓ నీల్ సభ్యుడు. ఆ మిషన్‌కు వెళ్లే ముందు తాను ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నట్టు రాబర్ట్ చెబుతాడు. లాడెన్‌ను తాము చంపుతాము... అలాగే లాడెన్ చేతిలో తాము కూడా చనిపోతామని అనుకున్నట్టు రాబర్ట్ తెలిపాడు. ఆరోజు జరిగిన కాల్పుల్లో బిన్ లాడెన్ ఒంట్లో బుల్లెట్స్ దించింది రాబర్ట్ కావడంతో చాలాకాలం తన పేరు బయటకు రాకుండా అమెరికా జాగ్రత్త పడింది.
అమెరికాలో పెరుగుతున్న లైసెన్స్డ్ గంజాయి డిస్పెన్సరీలు
అమెరికాలో ఇప్పుడు స్ట్రెస్ తొలగించడానికి గంజాయి ఒక మందుగా ఇస్తున్నారు. మైల్డ్ డోస్‌లో గంజాయి ఇచ్చే లైసెన్స్ కలిగిన డిస్పెన్సరీలు ప్రస్తుతానికి అమెరికాలో 300 పైనే ఉన్నాయి. ఈ ఏడాది చివరికి ఈ సంఖ్య 600 దాటే అవకాశం ఉందని పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. అమెరికాలో వీటి మార్కెట్ ప్రస్తుతానికి బిలియన్ డాలర్లపై మాటే. ఇండియా సహా చాలా దేశాల్లో గంజాయి అమ్మినా వాడినా కఠిన శిక్షలు తప్పనిసరి. చట్ట రిత్యా నేరం.
Also Read: మోదీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారంటే అర్థమవ్వలేదా ఖతార్ అమీర్ రేంజ్