US-Iran War End:గత కొంతకాలంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే మే 6 నాటికి తాజా పరిణామాలు ఒక శుభార్తను మోసుకొచ్చాయి. అమెరికా, ఇరాన్ దేశాలు తమ మధ్య ఉన్న శత్రుత్వాన్ని వీడి, శాంతి దిశగా పయనించేందుకు ఒక ప్రాథమిక ఒప్పందం దిశగా ఆడుగులు వేస్తున్నాయి. ఈ పరిణామం కేవలం రెండు దేశాలకే కాకా, ప్రపంచ వాణిజ్యానికి, ఇంధన భద్రతకు ఎంతో కీలకంకానుంది. 

Continues below advertisement

ఒప్పందంలో ఏం ఉంది?

ఈ ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం, ఇరు దేశాలు కొన్ని కీలకమైన షరతులకు అంగీకరించాల్సి ఉంటుంది. ఇరాన్ తన అణు శుద్ధి కార్యక్రమాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించుకోవాలి. అంతే కాకుండా తన వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియంను తొలగించేందుకు కూడా ఇరాన్ అంగీకరించినట్టు సమాచారం. దీనిని అమెరికాకు తరలించే అవకాశం కూడా చర్చల్లో ఉంది. దీనికి బదులుగా అమెరికా ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తుంది. దీని వల్ల వివిధ దేశాల్లో నిలిచిపోయిన బిలియన్ల కొద్ది డాలర్ల ఇరాన్ నిధులు తిరిగి ఆ దేశానికి చేరుతాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్‌ జలసంధి గుండా నౌక రాకపోకలపై ఉన్న ఆంక్షలను ఇరు దేశాలు తొలగించనున్నాయి. 

అమెరికా చేపట్టిన ఆపరేష్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్‌పై 66 రోజుల పాటు కొనసాగిన బాంబు దాడులు ముగిశాయని అమెరికా ప్రకటించింది. ఈ యుద్ధం వాతావరణం వల్ల అంతర్జాతీయంగా వినియోగదారులపై పడే భారాన్ని తగ్గించడానికి, ఆర్థిక స్థిరత్వం కోసం దౌత్యపరమైన పరిష్కారమే మార్గమని అమెరికా భావిస్తోంది. 

Continues below advertisement

ఈ చర్చల వెనుక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించిన ప్రత్యేక ప్రతనిధులు స్టీవ్‌ విట్‌కాఫ్‌, జారెడ్ కుష్నర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు ఇరాన్ అధికారులతో నేరుగా మధ్యవర్తుల ద్వారా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చర్చల పురోగతిని దృష్టిలో ఉంచుకునే హార్ముజ్‌ జలసంధిలో కొత్త సైనిక చర్యలను చేపట్టవద్దని ట్రంప్ నిర్ణయించారు. 

ఈ ఒప్పందం కుదిరిన తర్వాత, సుమారు 30 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరుగుతాయి. ఈ చర్చలకు ఇస్లామాబాద్‌ లేదా జెనీవా వేదికయ్యే అవకాశం ఉంది. ఇరాన్ ఈ నిషేధం ఐదేళ్లు ఉండాలని కోరుతుండగా, అమెరికా 20 ఏళ్లు కావాలని పట్టుబడుతోంది. ప్రస్తుతం ఇది 12 నుంచి 15 ఏళ్ల మధ్య కుదిరే అవకాశం ఉంది. ఒక వేళ చర్చలు విఫలమైతే, అమెరికా తిరిగి సైనిక చర్యలు చేపట్టే లేదా నావికా దళ దిగ్బంధనాన్ని కొనసాగించే అవకాశం కూడా ఉంది.