US former President Joe Biden diagnosed With Cancer: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్ బారిన పడ్డారు. బైడెన్ కార్యాలయం ఆదివారం (మే 18)న మాజీ అధ్యక్షుడికి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందని ధృవీకరించింది. వైద్య పరీక్షలలో డాక్టర్లు మొదట చిన్న గడ్డను గుర్తించారు. పూర్తి స్థాయిలో టెస్టులు చేయగా అది అగ్రెసివ్ ప్రొస్టేట్ క్యాన్సర్‌గా తేలినట్లు బైడెన్ ఆఫీసు వెల్లడించింది.  

అమెరికా మాజీ ప్రెసిడెంట్ బైడెన్ ప్రతినిధి తెలిపిన విషయం ప్రకారం, ఆయన క్యాన్సర్ గ్లీసన్ స్కోర్ 9 (గ్రేడ్ గ్రూప్ 5), ఇది క్యాన్సర్‌లో అడ్వాన్స్‌డ్ స్టేజ్ అని సూచిస్తుంది. క్యాన్సర్ మహమ్మారి ఎముకలకు వ్యాపించింది. దీనిని వైద్య శాస్త్రంలో మెటాస్టాసిస్ అని అంటారు. ఇది హార్మోన్ సెన్సిటివ్. పరిస్థితి తీవ్ర మైనప్పటికీ, చికిత్సకు మార్గాలున్నాయి. ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఉన్న అవకాశాలను బైడెన్ కుటుంబం పరిశీలిస్తోంది.

బైడెన్ త్వరగా కోలుకోవాలని అమెరికన్ నేతల ఆకాంక్షజో బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ అని, ఆయన ఆరోగ్యం గురించి వార్తలు రావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, అనేక మాజీ మరియు ప్రస్తుత నేతలు ఆయన కుటుంబానికి మద్దతుగా నిలిచారు. బైడెన్ త్వరగా కోలుకోవాలని, దేవుడు ఆయనకు మరింత ధైర్యాన్ని, బలాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మెలనియా ట్రంప్ మాజీ అధ్యక్షుడు బైడెన్ కుటుంబానికి మద్దతు తెలుపుతున్నాం. ఆయన చికిత్స ద్వారా వేగంగా కోలుకోవాలని ట్రంప్ ఆకాంక్షించారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు, భారతీయ మూలాలున్న మహిళ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఒక యోధుడు అని, ఈ సవాలును తన దృఢ సంకల్పంతో ఆయన అధిగమిస్తారని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

హిలరీ క్లింటన్, మార్కో రూబియో ఏమన్నారు?అమెరికాలోని ఇతర నేతలు కూడా జో బైడెన్ క్యాన్సర్ వ్యాధి గురించి తెలిసిన తర్వాత స్పందించారు. బైడెన్ క్యాన్సర్‌తో పోరాడుతున్నందున నేను ఆయన గురించి ఆలోచిస్తున్నాను, ఇప్పుడు ఆయనకు సపోర్ట్ అవసరమని అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఈ కష్టకాలంలో జెనెట్, తాను బైడెన్ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నామని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గ్లీసన్ స్కోర్ అంటే ఏమిటి ?గ్లీసన్ స్కోర్ 9/గ్రేడ్ గ్రూప్ 5 అనేది ప్రాస్టేట్ క్యాన్సర్ అత్యంత తీవ్రమైన స్టేజీగా పరిగణిస్తారు. దీని అర్థం క్యాన్సర్ క్యాన్సర్ కణాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా చికిత్స చేయకపోతే ఇది ప్రాణాంతకంగా మారవచ్చు. అయితే, హార్మోన్-సెన్సిటివ్ అని ఉన్న కారణంగా చికిత్స ద్వారా బైడెన్ క్యాన్సర్‌ను నియంత్రించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.