ఉక్రెయిన్‌లో తిరుగుబాటు చేస్తున్న రెబల్స్‌ స్వతంత్రులని రష్యా ప్రకటించింది. రష్యా విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో తిరుగుబాటు చేస్తున్న ప్రాంతాలు స్వతంత్రులుగా ఉండే హక్కు ఉందని వాళ్లంతా ఉక్రెయిన్‌ నుంచి విముక్తి దొరికిన వాళ్లుగా రష్యా ప్రకటించింది.


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లోని తిరుగుబాటు ప్రాంతాలను స్వతంత్రంగా గుర్తించాలా వద్దా అనే విషయం తీవ్రంగా మంతనాలు జరిపారు.  చివరకు రెండు ప్రాంతాలను స్వతంత్రులుగా గుర్తించేందుకు అంగీకారం తెలిపారు. డోనెట్స్క్,  లుగాన్స్క్ ప్రాంతాలను స్వతంత్రంగా గుర్తింపుపై సీనియర్ అధికారులతో చాలా సమయం చర్చలు జరిపారు. 






2014లో క్రిమియాను స్యాతంత్య్రం ప్రకటించినప్పటి నుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది. ఇప్పటి వరకు 14,000 మందికిపైగా మరణించారు. ఇప్పుడు ఉక్రెయిన్ భారీ భూభాగాన్ని కోల్పోవడాన్ని అంగీకరించాలి లేదా అత్యంత శక్తివంతమైన పొరుగు దేశంతో యుద్ధానికి సిద్ధం కావాలి. 


వివాదాన్ని పరిష్కరించే లక్ష్యంతో 2015లో చేసుకున్న మిన్స్క్ శాంతి ఒప్పందాలకు అవకాశాలు లేవు అని భద్రతా మండలికి పుతిన్ చెప్పారు NATO, యూరోపియన్ యూనియన్‌లో చేరడానికి ఉక్రెయిన్ చేసిన ప్రయత్నాలు రష్యాకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. 


 రష్యాతో ఘర్షణకు ఉక్రెయిన్‌ను ఒక సాధనంగా ఉపయోగించడం తీవ్రమైన, పెద్ద ముప్పును కలిగిస్తుందని పుతిన్ భావిస్తున్నారు. 


కొన్ని వారాలపాటు సాగుతున్న ఉద్రిక్తతల  సాగుతుండగా పుతిన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. 


రష్యా తన సరిహద్దుల్లో 150,000 కంటే ఎక్కువ మంది సైనికులను మోహరించింది. దీన్ని పాశ్చాత్య నాయకులు తప్పుపట్టడం, పొరుగు దేశాలను దురాక్రమిస్తోందన్న విమర్శలను  మాస్కో ఖండిస్తూ రావడం కొన్ని రోజులుగా సాగుతున్న హైడ్రామా.


ముప్పును పసిగట్టిన ఉక్రెయిన్ పరిష్కరించడానికి UN భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశ పరచాలని వేడుకుంది. 


"అధ్యక్షుడు (వోలోడిమిర్) జెలెన్స్కీ చొరవతో, బుడాపెస్ట్ మెమోరాండంలోని ఆర్టికల్ ఆరు కింద వెంటనే సంప్రదింపులు జరపాలని నేను అధికారికంగా UNSC సభ్య దేశాలను అభ్యర్థించాను," అని విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ట్వీట్ చేశారు. 1994లో చేసుకున్న ఒప్పంద పత్రాన్ని జత చేశారు. అందులో రష్యా, యునైటెడ్ స్టేట్స్. బ్రిటన్ సంతకం చేసిన సంగతి గుర్తు చేశారు. 


సోమవారం ఉదయం ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్టు కూడా రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ మాత్రం అలాంటిదేమీ లేదని ప్రకటించింది. ఇలా వివాదం సాగుతుండగానే రష్యా కీలక ప్రకటన విడుదల చేసింది. 






దీన్ని ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి. ఇది కచ్చితంగా ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని అభిప్రాయపడుతున్నాయి.






ఇలా గుర్తించడానికి దారి తీసిన పరిస్థితులపై జాతీయ మీడియాతో పుతిన్‌ కాసేపట్లో మాట్లాడనున్నారు.