Twitter AWS, Cloudflare Down: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ (ఇప్పుడు X), అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) , క్లౌడ్‌ఫ్లేర్ సర్వర్లు మంగళవారం ఉదయం నుంచి గందరగోళానికి గురయ్యాయి. వందలాది మంది యూజర్లు ఈ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ చేసుకోలేకపోవడంతో, సోషల్ మీడియా, క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు పూర్తిగా ఆగిపోయాయి. డౌన్‌డిటెక్టర్ వంటి ట్రాకింగ్ వెబ్‌సైట్‌ల ప్రకారం, ఉదయం 9:00 GMT నుంచి సాయంత్రం 12:00 GMT వరకు ఈ ఆటంకాలు కొనసాగాయి, దీంతో మిలియన్ల మంది యూజర్లు ప్రభావితమయ్యారు. క్లౌడ్‌ఫ్లేర్ అధికారిక స్టేటస్ పేజీలో "సర్వర్ ఇష్యూ"గా చూపిస్తోంది. ఇది X, ఓపెన్‌ఎఐ, లెటర్‌బాక్స్‌డ్ వంటి వెబ్‌సైట్‌లపై ప్రభావం చూపింది.
క్లౌడ్‌ఫ్లేర్, ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్‌గా, వెబ్‌సైట్‌లకు సెక్యూరిటీ, పెర్ఫార్మెన్స్ , కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ CDN సేవలు అందిస్తుంది. మంగళవారం ఉదయం 8:00 GMT అంటే భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభమైన ఈ ఆటంకం, "Error 522" (కనెక్షన్ టైమ్డ్ అవుట్), "Error 500" (ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్) మెసేజ్‌లతో యూజర్లను ఇబ్బంది పెట్టింది. X (ట్విట్టర్)లో ట్వీట్‌లు లోడ్ కాకపోవడం, AWSలో క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ సమస్యలు, మల్టీప్లేయర్ గేమ్‌లు కాల్ ఆఫ్ డ్యూటీ వంటివి ఆఫ్‌లైన్ కావడం వంటి ఇష్యూలు ఎదురయ్యాయి.
క్లౌడ్‌ఫ్లేర్ స్టేటస్ లో "వివిధ కస్టమర్లపై ప్రభావం చూపే సమస్యను గుర్తించాం. పరిష్కరిస్తున్నాం" అని ప్రకటించింది. ధర్డ్ పార్టీ ప్రొవైడర్‌తో కలిసి పరిష్కారం కోసం పని చేస్తున్నట్టు తెలిపారు. డౌన్‌డిటెక్టర్ పెద్ద ఎత్తున యూజర్లు రిపోర్ట్ చేశారు. ఈ సమస్యకు AWS డైరెక్ట్‌గా కారణం కాకపోయినా, AWS సేవలు క్లౌడ్‌ఫ్లేర్‌పై ఆధారపడటంతో కొంత ప్రభావం చూపినట్లుగా భావిస్తున్నారు.
ఈ ఆటంకం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. X (ట్విట్టర్) యూజర్లు ట్వీట్లు చేయలేకపోయారు. చూడలేకపోయారు. ఓపెన్‌ఎఐ చాట్‌జీపీటీ సేవలు, లెటర్‌బాక్స్‌డ్ వంటివి కూడా డౌన్ అయ్యాయి. . భారత్, USA, యూరప్‌లోని యూజర్లు ఎక్కువగా ప్రభావితమయ్యారు. డౌన్‌డిటెక్టర్ ప్రకారం, Xకు 18,000కు పైగా కంప్లైంట్లు, AWSకు 32,000కు పైగా రిపోర్టులు వచ్చాయి. తర్వాత చాలాచోట్ల సమస్యను పరిష్కరించారు. క్లౌడ్‌ఫ్లేర్ "మెష్ లేయర్"లోని రూటింగ్ చేంజ్ కారణంగా ఈ సమస్య వచ్చినట్టు అనుమానిస్తున్నారు.