Trump welcome foreign workers: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ కార్మికులకు “స్వాగతం” అని ప్రకటించారు. అమెరికాలో పెట్టుబడులు వెనక్కి పోకుండా.. కొత్తగా రావాలంటే ఇలాంటి నిర్ణయం తప్పదని ఆయన అనుకుటున్నారు. సెప్టెంబర్ 4న జార్జియాలోని ఒక కన్‌స్ట్రక్షన్ సైట్‌లో సుమారు 475 మంది అమెరికాలో అక్రమంగా పని చేస్తున్నారని అరెస్టు చేశారు. వారిలో అత్యధిక మంది దక్షిణ కొరియాకుచెందిన వారు. హ్యుండాయ్-ఎల్‌జీ నిర్వహించే ఎలక్ట్రిక్ వెహికల్ (EV) బ్యాటరీ ఫ్యాక్టరీలో జరిగాయి. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు, ఈ కార్మికుల వీసా అయిపోయిందని మాన్యువల్ లేబర్‌కు అనుమతించని పర్మిట్‌లు కలిగి ఉన్నారన్న కారణంగా అరెస్టు చేశారు.
ట్రంప్ దేశవ్యాప్తంగా ప్రారంభించిన విస్తృత ఇమ్మిగ్రేషన్ క్రాక్‌డౌన్ ప్రకారం ఒకే సైట్‌లో అతిపెద్ద ఆపరేషన్‌గా ఈ అరెస్టులు ప్రచారం పొందాయి. కార్మికులను చైన్‌లు, హ్యాండ్‌కఫ్‌లతో బంధించి అరెస్ట్ చేసిన ఫోటోలు దక్షిణ కొరియాలో వైరల్ గా మారింది. దీంతో దక్షిణ కొరియా ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ కార్మికులందర్నీ తమ దేశానికి తీసుకు వచ్చింది. తర్వాత కీలక ప్రకటన చేసింది. పరిస్థితులు ఇలాగే ఉంటే.. అమెరికాలో తమ పెట్టుబడులు పునరాలోచిస్తామని ప్రకటించింది. దీంతో ట్రంప్ వెంటనే దిగి వచ్చారు. కొరియా ట్రేడ్ యూనియన్‌లు అధికారికంగా క్షమాపణ చెప్పాలని ట్రంప్ ను డిమాండ్ చేస్తున్నాయి.
ట్రంప్ తన కామెంట్స్‌ను తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. అమెరికన్లకు చిప్‌లు, సెమీకండక్టర్‌లు, కంప్యూటర్‌లు, షిప్‌లు, ట్రైన్‌లు వంటి చాలా కాంప్లెక్స్ ప్రొడక్ట్‌లను తయారు చేయడం నేర్చుకోవడానికి విదేశీ ఎక్స్‌పర్ట్‌లను తాత్కాలికంగా అమెరికాకు అనుమతిస్తామన్నారు. అమెరికా గతంలో గొప్పగా ఉండేది కానీ ప్రస్తుతం ఆ స్థితి లేదని, ఈ ప్రొడక్ట్‌ల తయారీని నేర్చుకోవాలని అమెరికన్లకు ట్రంప్ సూచించారు. పెట్టుబడులు రావాలంటే ఆయా పనులు వచ్చిన నిపుణులు అమెరికాకు రావాలని వారి వద్ద నుంచి అమెరికన్లు నేర్చుకోవాలన్నారు.
ట్రంప్ అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని, తయారీరంగాన్ని పెంచాలని అంటున్నారు. పెట్టుబడులు పెట్టేలా ఇతర సంస్థల్ని దాదాపుగా బెదిరిస్తున్నారు.అయితే అమెరికాలో తయారీ రంగం చాలా ఖర్చుతో కూడుకున్నది. అక్కడ వర్కర్స్ కూడా లభించరు. మ్యాన్ పవర్ చాలా పరిమితంగా ఉంటుంది. ప్యాక్టరీల్లో పని చేసే వాళ్ల కోసంస ఇతర దేశాల వారి మీద ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే ట్రంప్ అమెరికన్లను నేర్చుకోవాలని సలహాలిస్తున్నారు.