Titanic Tourist Submarine:
టూరిస్ట్ సబ్‌మెరైన్ గల్లంతు..
టైటానిక్ (Titanic Ship Tragedy) షిప్ మునిగిపోయిన ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ సబ్‌మెరైన్ అదృశ్యమవడం సంచలనమవుతోంది. అది మునిగిపోయిన ప్రాంతంలో సముద్ర గర్భంలో నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఐదుగురు ఓ సోనార్ (Sonar)ని వినియోగించి ఆ శబ్దాలు ఎక్కడ నుంచి వినిపిస్తున్నాయో కనుగొనే పనిలో పడ్డారు. ఈ నెల 19వ తేదీ నుంచి వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ చోట గట్టిగా శబ్దాలు వినిపించడం వల్ల సెర్చ్ ఆపరేషన్‌లో మరింత వేగం పెంచారు. దీనిపై యూఎస్ కోస్ట్ గార్డ్ కీలక వివరాలు వెల్లడించింది. ఆ సబ్‌మెరైన్‌తో కమ్యూనికేషన్ కట్ అయిపోయిందని తెలిపింది. వీలైనంత త్వరగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది.
"ఓ చిన్న టైటానిక్ టూరిస్ట్ సబ్‌మెరైన్ మిస్ అయింది. ప్రమాద సమయంలో అందులో ఐదుగురున్నారు. దాదాపు 96 గంటల వరకూ నీళ్లలో ఉండే కెపాసిటీ ఆ సబ్‌మెరైన్‌కి ఉంది. కానీ...అది ఇంకా సముద్ర గర్భంలోనే ఉందా..లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. నీళ్లలో తేలి ఎక్కడికైనా కొట్టుకుపోయిందా అన్నదీ అర్థం కావడం లేదు. కమ్యూనికేషన్ కూడా పూర్తిగా కట్ అయిపోయింది. ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం ఇది నీళ్లలోకి వెళ్లింది. ఓ గంట తరవాత నుంచి మిస్ అయింది"
- యూఎస్ కోస్ట్ గార్డ్
సెర్చ్ ఆపరేషన్..
ఫ్రెంచ్ మిలిటరీకి చెందిన ఓ కీలక వ్యక్తితో పాటు ఓ సైంటిస్ట్ కూడా అందులో ఉన్నట్టు సమాచారం. Oceangate కంపెనీ టైటానిక్ శకలాలను చూసేందుకు సబ్‌మెరైన్ టూర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి కొంత మంది ఈ టూర్‌కి వెళ్లొచ్చారు. అలాగే టూర్‌కి వెళ్లిన ఐదుగురు ఇప్పుడు కనిపించకుండా పోయారు. దాదాపు 13 వేల అడుగుల లోతులోకి వెళ్లిన సబ్‌మెరైన్‌ను కనుగొనడం అధికారులకు సవాలుగా మారింది. ఆ ఐదుగురినీ ప్రాణాలతో బయటకు తీసుకొస్తామని ధీమాగా చెబుతున్నా...సెర్చ్ ఆపరేషన్‌కి మాత్రం సమస్యలు ఎదురవుతున్నాయి.