Taliban carries out sixth public execution: ఆఫ్గానిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వం నుంచి అధికారం చేజిక్కించుకున్న తర్వాత తాలిబన్లు ప్రపంచ దేశాల నుంచి ఆగ్రహం వస్తుందని కాస్త సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ వారు రెచ్చిపోతున్నారు. బహిరంగ మరణశిక్షలు అమలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆరుగురికి మరణశిక్షలు విధించారు.తాజాగా ఓ వ్యక్తికి విధించిన మరణశిక్ష అత్యంత ఘోరంగా ఉంది. అందరి ముందు ... నిలబెట్టి మూడు బుల్లెట్లతో కాల్చి చంపారు. ఇలా చంపడాన్ని ఆ వ్యక్తి కుటంబసభ్యులు కూడా ఎదురుగా ఉండి చూడాల్సి వచ్చింది. అంటే వారి కుటుంబసభ్యుడ్ని వారి కళ్ల ముందే కాల్చి చంపేశారు. అదే మరణశిక్ష అమలు చేయడం. శిక్ష అతనికే కాక అతని కుటుంబం మొత్తానికి విధించారన్నమాట.
కెనడా మాదే తెల్లోళ్లు యూరోప్ వెళ్లిపోవాలి- ఖలీస్థానీ సపోర్టర్ల కొత్త డిమాండ్ ! తిక్క కుదిరినట్లే !
తాలిబన్ల చట్టాలు అత్యంత ఘోరంగా ఉంటాయి. చనిపోయిన వ్యక్తిని కూడా ఉరేసి చంపడం వంటి చట్టాలతో వారు క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రస్తుతం బ హిరంగంగా కాల్చి చంపిన వ్యక్తి చాలా కాలంగా జైల్లో ఉంటున్నారు. ఆయన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. అతనే హత్య చేసినట్లుగా తాలిబన్ల మిలటరీ కోర్టులు నిర్ధారించి కాల్చి చంపేశాయి. ఇటీవలి కాలంలో ఆరుగురికి ఇలా మరణ శిక్షలు విధించాయి. తాలిబన్లపై ప్రజలు తిరగబడకుండా వారు అప్పుడప్పుడూ జైళ్లల్లో ఉన్న ఖైదీలకు శిక్షలు ఖరారు చేసి ఇలా అందరి ముందు కాల్చి చంపి భయపెడుతూ ఉంటారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
1999లో కూడా తాలిబన్లు ఆప్ఘాన్‌ను పరిపారిస్తూ ఉండేవారు. అప్పట్లో ఇంకా ఘోరమైన శిక్షలు విధించేవారు. మహిళల్ని కూడా వదిలి పెట్టకుండా చంపేసేవారు. ఇలాంటి శిక్షలు అప్పట్లో అంతర్జాతీయ సమాజాన్ని కదిలించాయి. నిజానికి ఆప్ఘాన్‌లో ఏమి జరుగుతుందో అంత తేలికగా బయటకు రాదు. అక్కడ పూర్తిగా తాలిబన్ రూల్స్ అమలవుతూ ఉంటాయి. ఇంటర్నెట్ అనేది దాదాపుగా ఉండదు. సోషల్ మీడియాను ఎవరూ ఉపయోగించుకోలేరు. మహిళలపై కట్టుదిట్టమైన అణచివేత ఉంటుంది. ఉల్లంఘిస్తే తీవ్ర శిక్షలకు గురవుతారు. అతి క్,టం మీద అక్కడి సమాచారం అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలుసుకుని బయట ప్రపంచానికి అందిస్తూంటాయి.
Also Read; టెలిగ్రామ్ సీఈవో రియల్ విక్కీ డోనర్ - స్పెర్మ్ ఇచ్చి ఉచితంగా ఐవీఎఫ్ చేయిస్తాడట - ఒకటే కండిషన్
తాలిబన్లు రెండో సారి ఆప్ఘన్ ను ఆక్రమించుకోక ముందు ప్రజాప్రభుత్వం ఉండేది. ఆ సమయంలో మహిళలు యథేచ్చగా విద్యా, ఉద్యోగ అవకాశాలను పొందేవారు. ఇప్పుడు అలాంటి వారు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. తాలిబన్ల రూలింగ్‌పై ప్రపంచదేశాలు సైలెంట్ గా ఉంటున్నాయి. ఎవరూ జోక్యం చేసుకోవడండ లేదు.