Earth Cracks in Africa: 


ఆఫ్రికాలో చీలికలు..


వాతావరణ మార్పుల ఎఫెక్ట్ మరి కొన్నేళ్లలో గట్టిగానే కనిపిస్తుందని సైంటిస్ట్‌లు ఇప్పటికే హెచ్చరించారు. ఇప్పటికే ఈ ప్రభావం మొదలైంది కూడా. సీజన్స్‌ మారిపోతున్నాయి. కరవు ముంచుకొస్తోంది. నేలలోనూ మార్పులు వస్తున్నాయి. కొన్ని చోట్ల భూమి కుంగిపోతోంది. మరి కొన్ని చోట్ల చీలిపోతోంది. అది కూడా చాలా వేగంగా. ఆఫ్రికాలో ఈ ముప్పు తీవ్రంగా కనిపిస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచే అక్కడి భూమిలో పగుళ్లు వస్తున్నాయి. దాదాపు 56 కిలోమీటర్ల మేర భూమి చీలిపోగా...జూన్ నాటికి ఇది మరింత వ్యాప్తి చెందింది. క్రమక్రమంగా కుంగిపోతోంది. ఆఫ్రికాలోనే ఎందుకిలా..? ఈ ముప్పు మరింత తీవ్రతరమవుతుందా..? అన్న కోణాల్లో సైంటిస్ట్‌లు అధ్యయనం చేశారు. కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. 


ఎందుకిలా..? 


Geological Society of London సైంటిస్ట్‌లు చెప్పిన వివరాల ప్రకారం...రెడ్‌ సీ నుంచి మొజాంబిక్ వరకూ  దాదాపు 3,500 కిలోమీటర్ల మేర భూమి చీలిపోయింది. చాలా వేగంగా ఇది విస్తరిస్తోంది. క్రమంగా ఆ ప్రాంతంలో నేలంతా కుంగిపోతోంది. చీలిపోవడం వల్ల పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే ఆఫ్రికా రెండు ముక్కలైపోతుందని..మధ్యలో కొత్తగా ఓ సముద్రం పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెబుతున్నారు సైంటిస్ట్‌లు. అయితే...అసలు ఎందుకిలా జరుగుతోందని టెక్టానిక్ ప్లేట్స్‌పై అధ్యయనం చేస్తున్నారు. 


నాసా ఏం చెబుతోంది..?


ఆఫ్రికా నేలల్లో చీలికలు రావడంపై నాసా కూడా స్పందించింది. ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు వెల్లడించింది. నాసాకు చెందిన Earth Observatory కీలక వివరాలు వెల్లడించింది. ఈస్ట్ ఆఫ్రికాలోని సోమాలియాలో టెక్టానిక్ ప్లేట్‌లు ఆఫ్రికన్ టెక్టానిక్‌ ప్లేట్‌లతో విడిపోతుండటం వల్ల ఈ చీలికలు వస్తున్నాయని చెప్పింది. ఆఫ్రిరన్ టెక్టానిక్ ప్లేట్స్‌నే సైంటిఫిక్‌గా Nubian Plateగా పిలుస్తారు. ఈ రెండూ వేరైపోతుండటం వల్ల క్రమంగా నేల పగిలిపోతోందని తెలిపారు నాసా శాస్త్రవేత్తలు. ఇక్కడ మరో సవాలు ఏంటంటే...అన్ని చోట్లా Y ఆకారంలో భూమి చీలిపోతుండటం. ఇతియోపియాలో ఇప్పటికే దీన్ని గుర్తించారు. ప్రస్తుతానికి ఇది సాధారణ సమస్యలాగే కనిపించినా భవిష్యత్‌లో అతి పెద్ద ముప్పుగా మారుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా హెచ్చరించింది. ఇంకెంత కాలం ఈ ప్రభావం కొనసాగుతుందో ప్రస్తుతానికి స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.