Texas woman meltdown over Indians: అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన మహిళ  భారతీయులను  ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అవుతోంది.  టెక్సా్లో  భారతీయ సంతతికి చెందిన వారి సంఖ్య పెరిగిపోతోందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కాస్ట్ కో లాంటి సూపర్ మార్కెట్లకు వెళ్లినా తాను టెక్సాస్ లో అన్నట్లుగా అనిపించడం లేదని ఆమె అంటున్నారు. 

Continues below advertisement

అదే సమయంలో మహాత్మాగాంధీ విగ్రహం  ఇర్వింగ్ లో ఉంది. దానిపైనా వ్యాఖ్యలు చేశారు. గాంధీ విగ్రహం ఉండటం వల్ల ఇంకా ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారని ...అమెరికాలో ఉండేవారు అమెరికన్ సంస్కృతిని గౌరవించాలని, విదేశీ నాయకుల విగ్రహాలు ఇక్కడ ఎందుకని ఆమె వీడియోలో ప్రశ్నించింది. గాంధీ విగ్రహతం తన ఇంటికి ఎదురుగా ఉన్న పార్కులో   ఏర్పాటు చేయడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు.      

సదరు మహిళ ప్రవర్తనను నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అహింసా మూర్తిగా ప్రపంచం గుర్తించిన గాంధీ విగ్రహంపై  నిగ్రహం కోల్పోవడం   ఆమె అజ్ఞానానికి నిదర్శనమని చాలా మంది భారతీయ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటన కేవలం ఒక విగ్రహం గురించిన వివాదం మాత్రమే కాదని, దీని వెనుక పెరుగుతున్న జెనోఫోబియా  అంటే విదేశీయుల పట్ల ద్వేషం కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   

అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ సంతతి ప్రజలను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ప్రవాస భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.