తైవాన్‌లో 7.0 తీవ్రతతో భయంకరమైన భూకంపం సంభవించింది. తైపీలోని భారీ భవంతులు ఒక్కసారిగా కంపించాయి. తైవాన్ వాతావరణ సంస్థ భూకంపం సంభవించినట్లు ధృవీకరించింది. సెంట్రల్ వెదర్ ఏజెన్సీ ప్రకారం, శనివారం రాత్రి 11:05 గంటలకు తైవాన్ ఈశాన్య తీర నగరమైన యిలాన్‌లో భూకంపం సంభవించింది. యిలాన్ కౌంటీ హాల్‌కు 32.3 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు.

Continues below advertisement

ఫైర్ ఏజెన్సీ సమాచారం తైవాన్ నేషనల్ ఫైర్ ఏజెన్సీ ప్రకారం, నష్టాన్ని అంచనా వేశారు. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ ముప్పు లేదని తెలియడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం రాత్రి భూకంపం వచ్చింది. ఫైర్ ఏజెన్సీ దీని గురించి X (ట్విట్టర్)లో సమాచారం ఇచ్చింది. ప్రజలకు ముందుగా తమను తాము రక్షించుకోవాలని సూచించింది. ప్రమాదకరమైన వస్తువులకు దూరంగా ఉండాలని చెప్పింది. మంచం దగ్గర బూట్లు, టార్చ్ లైట్ ఉంచుకోండి. కదలిక ఆగిపోయిన తర్వాత మాత్రమే ఏదైనా పనులు చేయండి. లేకపోతే ఇబ్బంది పడతారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. 

ఎటువంటి ఆస్తి నష్టం లేదుప్రస్తుతానికి, తైపీ అధికారులు భూకంపం వల్ల ఎవరూ మరణించలేదని చెప్పారు. తక్షణ నష్టం జరిగినట్లు నివేదికలు లేవని తెలిపింది. స్థానిక మీడియా ప్రకారం, తైవాన్ రాజధానిలో భూకంపం కారణంగా భారీ భవనాలు సైతం కంపించాయి. తైవాన్ అంతటా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

తైవాన్ వాతావరణ శాఖ ఏం చెప్పింది?తైవాన్ వాతావరణ శాఖ కొత్త భూకంపం నమోదైంది. తాజాగా సంభవించిన భూకంపం బుధవారం తైవాన్ ఆగ్నేయ తీర కౌంటీ అయిన తైతుంగ్‌లో వచ్చిన 6.1 తీవ్రత భూకంపం వచ్చిన మూడు రోజులకు సంభవించిందని తెలిపింది. దీనివల్ల తైవాన్ లో పలు ప్రాంతాల్లో భవనాలు కంపించాయి. భూకంప కేంద్రం లోతు 11.9 కిలోమీటర్లుగా నమోదైంది. ఈ భూకంప ప్రకంపనలు కౌశుంగ్‌తో సహా తైవాన్‌లోని అనేక ప్రాంతాలలో సంభవించాయి. కొన్నిచోట్ల ఇండ్లలో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి.

2024లో భూకంపం సంభవించడంతో 17 మంది మృతి2024 ఏప్రిల్‌లో తైవాన్‌లో 7.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇది గత 25 ఏళ్లలో అత్యంత తీవ్రమైన భూకంపం అని తెలిసిందే. గత ఏడాది సంభవించిన భూకంపంలో కనీసం 17 మంది మరణించారు. ఆ భూకంపంలో కొండచరియలు కూడా విరిగిపడ్డాయి.