Sri Lanka was completely devastated by Cyclone Ditwah: శ్రీలంకను తుఫాను దిత్వా (Cyclone Ditwah) తీవ్రంగా నష్టపరిచింది. శ్రీలంక దేశ చరిత్రలో అతిపెద్ద విపత్తుగా నిలిచింది. ఐదు వందల మందికిపైగా మరణించారు. వందల మంది మిస్సయ్యారు.12 లక్షల మంది నిర్వాసితులయ్యారు. ప్రపంచ దేశాలు సాయం అందిస్తున్నాయి.
దిత్వా తుఫాను, తీవ్ర వర్షాలతో శ్రీలంక మొత్తాన్ని వణికించింది. కొలంబో వంటి వాణిజ్య కేంద్రాలు, కెలానియా లాంటి సబర్బ్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తూర్పు ప్రాంతంలో అరు రిజర్వాయర్ ఓవర్‌ఫ్లో అయి, ఊళ్లు మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 500 మి.మీ. మించి వర్షాలు పడటం వల్ల ల విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ సిస్టమ్‌లు కుప్పకూలాయి.
శ్రీలంక ప్రెసిడెంట్ ఇది శ్రీలంక చరిత్రలో అతిపెద్ద విపత్తు అని ప్రకటించారు. డిసాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్ ప్రకారం, 24 వేల పైగా పోలీసు, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది రక్షణ పనులు చేస్తున్నారు. WHO ఎమర్జెన్సీ ఫండ్స్ పంపి, ఆరోగ్య సేవలు పెంచుతోంది.
శ్రీలంక ఇప్పటికే అనేక ఆర్థిక సమస్యల్లో ఉంది. ఇప్పుడు దిత్వా వల్ల మౌలిక సదుపాయాలకు నష్టం జరగడంతో శ్రీలంక మరిన్ని కష్టాల్లో కూరుకుపోనుంది.