రాకెట్ పేలిపోయింది. ఆ రాకెట్ పంపించిన స్పేస్ కంపెనీ వాళ్లంతా నవ్వుతున్నారు గోల గోల చేస్తున్నారు. వాళ్ల బాస్ తో సహా. ఎలన్ మస్క్ గురించి..స్పేస్ ఎక్స్ సృష్టించిన సంచలనాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ నిన్న ఫెయిల్ అయిన స్టార్ ఫిష్ రాకెట్ అసలు లిఫ్ట్ ఆఫ్ అవటమే ఎంత గొప్ప విషయమో కాసేపు మాట్లాడుకుందాం. 


అసలు రాకెట్ ప్రయోగాలనేవి కొన్ని వందల వేల కోట్ల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలాంటిది ఓ రాకెట్ రీ యూజ్ చేయొచ్చా. కేవలం అప్పటి వరకూ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన ఈ ఫీట్ ను నిజం చేసి చూపించారు ఎలన్ మస్క్. 2002లో స్పేస్ ఎక్స్ అనే చిన్న సంస్థ స్థాపించి ఎప్పటికైనా ఓ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపించాలని కలలు కన్న ఎలన్ మస్క్ అనే టీనేజర్ నుంచి ఈరోజు 390 అడుగుల ఎత్తైన.. 5వేల మెట్రిక్ టన్నుల బరువున బాహుబలి రాకెట్ గాల్లో అమాంతం పేలిపోయినా మొహం మీద చిరనవ్వుతో ఉన్న స్థితప్రజ్ఞుడు ఎలన్ మస్క్ అతని జర్నీ అన్ ఇమాజినబుల్.. సో మచ్ ఇన్ స్పిరేషన్.


ఇప్పుడు స్పేస్ ఎక్స్ ప్రయోగించే ఏ రాకెట్ అయినా రీ యూజబుల్..అంటే గాల్లోకి వెళ్లి పోయిన తర్వాత దాని ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ విడి భాగం రాకెట్ ను అంతరిక్షంలో పంపించి మళ్లీ వచ్చి ఎక్కడైతే ప్రయోగం జరిగిందో అక్కడే వచ్చి అంటుకుంటుంది.దీని ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు సేవ్ చేస్తున్నాడు ఎలన్ మస్క్. ఇప్పుడు ఈ భారీ స్టార్ షిప్ ప్రయోగం కూడా వచ్చే 200-300 ఏళ్ల ఫ్యూచర్ స్పేస్ ఎక్స్ ప్లొరేషన్స్ ను వాటి గమనాన్ని డిసైడ్ చేసేదే. ఆర్టెమిస్ 3 లో భాగంగా చంద్రుడి మీదకు మనుషులు పంపించాలనుకుంటున్న నాసా ఆ బాధ్యతలను స్పేస్ ఎక్స్ కే అప్పగించింది. 


అంతే కాదు ఆర్టెమిస్ అసలు లక్ష్యం మార్స్ మీద కాలనీలు ఏర్పాటు చేయటం..నాసా కే కాదు ఎలన్ మస్క్ లక్ష్యం కూడా అదే మార్స్ మీదకు మనుషులను పంపాలి. మనుషులు వాళ్లకు కావాల్సిన లగేజ్,వేల కిలోల గూడ్స్ ను పంపాలన్న చరిత్ర ఇప్పటి వరకూ చూడని స్థాయి రాకెట్ ను ప్రయోగించాలి. స్టార్ షిప్ తో ఎలన్ మస్క్ చేసింది. మనం గాల్లోకి లేచిన రాకెట్ కొద్దిసేపటికే పేలింది అనుకుంటున్నాం. కానీ ఎలన్ మస్క్ 5 వేల మెట్రిక్ టన్నుల రాకెట్ ను గాల్లోకి 39 కిలోమీటర్ల హైట్ పంపించాను అనుకుంటున్నాడు అంతే తేడా. చరిత్ర చూసిన ఏ విజయాలకైనా ఓటమే ఇనీషియల్ పాయింట్. ఎలన్ మస్క్ చూడని కన్నీళ్లు..ఎదుర్కోని అవమానాలు లేవు. ఇది కూడా అంతే. మరో నెలలో మళ్లీ స్టార్ షిప్ ను ప్రయోగించాలని స్పేస్ ఎక్స్ భావిస్తోంది. మన గ్రహం దాటి ఫ్యూచర్ లో మనిషి వేరే గ్రహాల మీదకు ఆవాసం కోసం వెళ్లే రోజులు వస్తే అప్పటికీ వినిపించే పేరు ఎలన్ మస్క్ దే అవుతుంది.


అయినా స్పేస్ ఎక్స్ ఓటమి ని చూసి మనం నవ్వుకోనక్కర్లేదు. వాళ్లే వాళ్ల ఫెయిల్యూర్స్ ను ఫన్నీ వీడియోలు గా చేసి పెడుతుంటారు. కావాలంటే మీరూ ఓ లుక్కేసేయండి. చివరగా ఈరోజు స్పేస్ ఎక్స్ కంపెనీ....ఎలన్ మస్క్ నిలబడిన స్థానం ఓటమిని స్టెప్పింగ్ స్టోన్స్ గా ఎలా మార్చుకుంటున్నారు..ఫెయిల్యూర్స్ ను కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా చూడండి.