Americans are showing racism against Sriram Krishnan: అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ తన టీమ్ ను రెడీ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్విభాగానికి సలహాదారుగా శ్రీరామ్ కృష్ణన్ అన్ భారతీయ మూలాలున్న నిపుణుడ్ని నియమించుకున్నారు. అతనిపై కొంత మంది అమెరికన్లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. అతను ఇండియన్ వంటకం బట్ చికెన్ లా ఉన్నాడంటూ ఓ నెటిజన్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశాడు. ఇందుకు రెండు ఫోటోల్ని జత చేశాడు. ఒకటి శ్రీరామ్ కృష్ణన్ ది కాగా.. మరొకటి ఏఐ జనరేట్ చేసిన బటర్ చికెన్ కర్రీది.
ఈ రెండూ ఒకలా ఉన్నాయంటూ అతను చేసిన పోస్టు వైరల్ అయింది. ఇలాంటి జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం అమెరికా సమాజానికి మంచిది కాదని చాలా మంది మండిపడ్డారు. అయితే కొంత మంది ఆ వ్యాఖ్యల్ని సమర్థించేవారు కూడా ఉండటం ఆందోళనకర పరిణామంగా మారుతోంది.
శ్రీరామ్ కృష్ణన్ కు మద్దతుగా ఎలాన్ మస్క్ స్పందించారు. ఆయనపై అలాంటి వ్యాఖ్యలు వంద శాతం తప్పని ట్వీట్ కు రిప్లయ్ గా పేర్కొన్నారు.
భారతీయ సంతతికి చెందిన VC కృష్ణన్ ఓ పెట్టుబడిదారు. ఇంతకు ముందు ట్విట్టర్ లో ప్రొడక్ట్ లీడర్‌గా పని చేసేవాడు. ఇప్పుడు, అతను A16z అని పిలువబడే సిలికాన్ వ్యాలీ పెట్టుబడి సంస్థ ఆండ్రీసెన్ హోరోవిట్జ్‌లో భాగస్వామి. ఈ సంస్థ మస్క్ Twitter కొనుగోలుకు నిధులు సమకూర్చింది. ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, కృష్ణన్, అతడి భార్య ఆర్తి రామమూర్తి ఇద్దరూ చెన్నైలో జన్మించారు. సాధారణ మధ్యతరగతి కుటంబానికి చెందిన వీరు.. 2003లో కలిశారు. అప్పటికే వీరిద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. ఇండియాలోనే స్కూలింగ్, కాలేజీ ఎడ్యుకేషన్ ను పూర్తి చేశాడు కృష్ణన్. ఆ తర్వాత తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలోని SRM ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ (B Tech) పూర్తి చేశారు. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో లోని నోయ్ వ్యాలీలో నివసిస్తున్నారు. వీరికి రెండు సంవత్సరాల కుమార్తె ఉంది.