అమెరికాలోని ఓక్లహోమాలోని తుల్సాలోని ఆసుపత్రి క్యాంపస్‌ కాల్పులతో మోతమోగింది. గుర్తు తెలియని దండగుడు జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించినట్టు పోలీసులు తెలిపినట్టు వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకటించింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు సమాచారం. ముష్కరుడిని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్లు కాల్చిచంపారా లేదా అతని కాల్చుకొని చనిపోయాడా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. 






ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓసారి మాల్‌ను టార్గెట్ చేసుకున్న దుండగులు... రెండోసారి స్కూల్‌ను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. ఇప్పుడు ఆసుపత్రిపై పడ్డాడు. ఇలా ఏదో ప్రాంతంలో కాల్పులు జరపడం నిత్య కృత్యంగా మారుతోంది. 


ఓక్లహోమాలోని తుల్సాలో జరిగిన కాల్పులపై అధ్యక్షుడు జో బిడెన్‌ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని వైట్‌హౌస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. పరిస్థితిని వైట్ హౌస్ నిశితంగా పర్యవేక్షిస్తోందన్నారు. స్టేట్‌, స్థానిక అధికారులను సంప్రదించింది మరింత సమాచారాన్ని కూడా సేకరించినట్టు పేర్కొంది. 






ఓక్లహోమాలోని తుల్సా మెడికల్ ఫెసిలిటీ వద్ద ఆసుపత్రి క్యాంపస్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. కెప్టెన్ రిచర్డ్ మీలెన్‌బర్గ్ మృతుల సంఖ్యను ధృవీకరించారు. ముష్కరుడు మరణించాడని పేర్కొన్నారు. తుల్సా పోలీస్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ చీఫ్ ఎరిక్ డాల్‌గ్లీష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దుండగుడు తనను తాను కాల్చుకున్నాడని చెప్పినట్టు CNN తెలిపింది. 


"ఇది ఒక భయంకరమైన విషాద సంఘటన," మీలెన్‌బర్గ్ అన్నారు. "అధికారులు చాలా త్వరగా స్పాట్‌కు చేరుకున్నారని... మరింత మంది మరణించకుండా గాయపడకుండా ఆపగలిగారు." అని తెలిపారు. 


"కేసు దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం భవనంలోని ప్రతి గదిని తనిఖీ అధికారులు చేస్తున్నారు" అని పోలీసులు సాయంత్రం 6 గంటలకు ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారని న్యూస్ ఏజెన్సీ పిటిఐ పేర్కంది.