ఫేస్‌బుక్‌కు చెందిన మెటాలో నంబర్ 2 ఎగ్జిక్యూటివ్ అయిన షెరిల్ శాండ్‌బర్గ్ సీఓఓ పదవి నుంచి వైదొలగనున్నారు. శాండ్‌బర్గ్ కంపెనీని స్టార్టప్ నుంచి డిజిటల్ అడ్వర్టైజింగ్ పవర్‌హౌస్‌గా మార్చడంలో ఆమె ఎన్నో అద్భుతాలు చేశారు. అందులో జరిగే తప్పులకు కూడా ఆమె బాధ్యత వహించారు. 


శాండ్‌బర్గ్ 14 సంవత్సరాలుగా సోషల్ మీడియా కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆమె 2008లో కంపెనీ పబ్లిక్‌గా మారడానికి నాలుగు సంవత్సరాల ముందు గూగుల్ నుంచి ఫేస్‌బుక్‌లో వచ్చారు. 


నేను 2008లో ఈ ఉద్యోగంలో చేరినప్పుడు, ఐదేళ్లపాటు ఈ పాత్రలో ఉంటానని ఆశించాను. పద్నాలుగు సంవత్సరాల తరువాత, నా జీవితంలోని కొత్త అధ్యాయాన్ని రాయడానికి ఇది సమయం అనిపించిందని అని శాండ్‌బర్గ్ తన అధికారిక ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో రాశారు.



శాండ్‌బర్గ్ ఫేస్‌బుక్, ఇప్పుడు మెటాస్, అడ్వర్టైజింగ్ బిజినెస్ చూసేవారు. దాన్ని సంవత్సరానికి $100 బిలియన్ల జగ్గర్‌నాట్‌కు పెంచారు. CEO మార్క్ జుకర్‌బర్గ్ తర్వాత కంపెనీకి రెండో అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తిగా శాండ్‌బర్గ్ ఉన్నారు. ఫేస్‌బుక్ కోసం ఆమె చేసిన కొన్ని పనులు కారణంగా వివాదాల్లో చిక్కుకున్నారు.  






ఫేస్‌బుక్‌ CEO మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ, శాండ్‌బర్గ్‌ను మిస్ అవుతున్నానని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె స్థానాన్ని భర్తీ చేయలేమన్నారు. అలాంటి ప్లాన్ కూడా చేయడం లేదన్నారు. జేవియర్ ఒలివాన్ తదుపరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉంటారని జుకర్‌బర్గ్ చెప్పారు. "ఇంటిగ్రేటెడ్ యాడ్స్, బిజినెస్ ప్రోడక్ట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంటెగ్రిటీ, అనలిటిక్స్, మార్కెటింగ్, కార్పొరేట్ డెవలప్‌మెంట్, గ్రోత్ టీమ్‌లకు నాయకత్వం వహిస్తారు. అయితే ఈ పోస్టు శాండ్‌బర్గ్ పాత్రకు భిన్నంగా ఉంటుందన్నారు జుకర్ బర్గ్.



శాండ్‌బర్గ్ మెటా డైరెక్టర్ల బోర్డులో కొనసాగుతారని కూడా జుకర్‌ బర్గ్‌ చెప్పారు. ప్రస్తుతం శాండ్‌బర్గ్ వయసు 52 ఏళ్లు. వాస్తవంగా ఇంటర్నెట్‌లో అతి పెద్ద, అత్యంత లాభదాయకమైన ప్రకటనల నెట్‌వర్క్‌ను వేగంగా రూపొందించడంలో గూగుల్‌కు సహాయం చేశారు. అయితే ఆ సమయంలో 23 ఏళ్ల వయసులో ఉన్న జుకర్‌బర్గ్‌కు గైడ్‌ చేస్తూ ఫేస్‌బుక్ ఫ్రీవీలింగ్ సోషల్ నెట్‌వర్క్‌ను లాభదాయకమైన కార్పొరేషన్‌గా మార్చే సవాలును స్వీకరించారు. తర్వాత ఎన్నో అద్భుతాలు చేశారు. అదై టైంలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.