Jeddah Drenched by Heavy Rain Floods Cause Chaos: సౌదీ అరేబియాలోని జెడ్డా నగరం భారీ వర్షాలతో మునిగిపోయింది. మంగళవారం నుంచి కురిసిన తుఫాను వర్షాలు, మెరుపులు, కెట్టెలు, ధూళి తుఫానులతో కలిసి వరదలు సృష్టించాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగి పోయాయి. జాతీయ వాతావరణ కేంద్రం (NCM) రెడ్ అలర్ట్ జారీ చేసి, ప్రజలు ఇంటి వద్దే ఉండమని సూచించింది.
జెడ్డా, మక్కా ప్రాంతంతో పాటు యంబు, మదీనా, రియాద్‌లలో కూడా ఈ తుఫాను ప్రభావం చూపింది. జెడ్డాలో 5 గంటల్లోపు ఉత్తర జిల్లాల్లో 81 మి.మీ. వర్షపాతం నమోదైంది. అల్-బసతీన్ ప్రాంతంలో 81 మి.మీ., కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 51 మి.మీ. వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 6 గంటల్లో 179 మి.మీ. వర్షపాతం కురిసింది. ఇది నవంబర్‌లో సగటు 23 మి.మీ., సంవత్సరం సగటు 55.6 మి.మీ. కంటే ఎక్కువ.
రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడంతో నగరం సముద్రం లా మారింది. కార్లు, ఇళ్లు మునిగిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆగిపోయింది. చాలా ఇళ్లలో విద్యుత్ కట్ అయింది. పాఠశాలలు, యూనివర్సిటీలు మూసివేశాయి. సౌదీలో వర్షాల పీక్ టైమ్ నవంబర్ నుంచి డిసెంబర్‌కు మారింది. క్లైమేట్ చేంజ్ వల్ల డెసర్ట్ ప్రాంతాల్లో ఇలాంటి తుఫానులు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా.
గల్ఫ్ లో సాధారణంగా వర్షాలు పడినా.. వెంటనే ఇంకిపోతాయి. కాని గత రెండు, మూడేళ్లుగా వరదలు వచ్చేంతగా వర్షాలు పడుతున్నాయి. తీవ్రమైన వర్షాలు వచ్చే అవకాశాల్లేవని డ్రైనేజీ సిస్టమ్ .. మామూలుగానే నిర్మించారు. ఈ కారణంగా డ్రైనేజీ.. ఈ వర్షాలను తట్టుకోవడంలేదు. ఫలితంగా వరదలు వచ్చేస్తున్నాయి. వరదల వల్ల ప్రాణాలు కూడా పోతూండటం ఎవరూ ఊహించలేని విషయం.