Viral News: రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్‌కు ఇండియన్ భర్త- గిబ్లీ చేసిన మ్యాజిక్ ఫొటో వైరల్
Chatgpt Ghibli Images:: ChatGPTతో గిబ్లీ ఇమేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు తమ ఫోటోలను గిబ్లీ శైలిలో మార్చి పోస్ట్ చేస్తున్నారు.
Dinara ChatGPT Ghibli: ఇటీవల సోషల్ మీడియాలో చాట్‌జిపిటి గిబ్లి ఇమేజ్ బాగా వైరల్ అవుతోంది. ప్రజలు తమ ఫొటోలను గిబ్లిలో మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భారతదేశం మాత్రమే కాకుండా విదేశీయులు కూడా ఉన్నారు. నిజానికి, రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్ దినారా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె చాలా కాలంగా భారతీయ జీవిత భాగస్వామి కోసం వెతుకుతోంది. తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె కామెడీ రీల్స్ కారణంగా వైరల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఫేమస్ అిన ఘిబ్లీలో కూడా తన భారతీయ మూలాలు ఉన్న భర్త గురించి అడిగి మరింత వైరల్ అయ్యారు.
చాట్‌జిపిటి సహాయంతో భారతీయ భర్త కోసం...
ఆమె OpenAI కొత్త ఫీచర్‌ను ఉపయోగించి తాజ్‌మహల్ ముందు తన ఫోటోను పెయింటింగ్‌గా మార్చారు. ఆ ఫొటో పక్కనే తనకు కాబోయే వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పాలని AIని అభ్యర్థించారు. ఆమె "భవిష్యత్ భారతీయ భర్త"ని యాడ్ చేయమని రిక్వస్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫోటో చూసి ఆశ్చర్యపోయారు. తాజ్‌మహల్ ముందు ఆమె నిలబడి ఉన్న ఫొటోకు సిక్కు వ్యక్తిని జోడించింది ఏఐ. ఈ వీడియోను పంచుకుంటూ దినారా తన ఇన్‌స్టాలో ఇలా రాసుకుకొచ్చారు "AI ప్రకారం నా భవిష్యత్ భారతీయ భర్త పంజాబీ!" అంటు సంబరపడిపోయారు.
ఆ తర్వాత, ఆమె AIని అభ్యర్థించింది, ఈ ఘిబ్లి పెయింటింగ్‌ను నిజమైన ఫోటోగా మార్చమని. ఫలితం ఏమిటంటే, AI ఒక 'అవివాహిత పంజాబీ భర్త' ఫోటోను చూపించింది. . కానీ ట్విస్ట్ ఏమిటంటే, దినారాకు ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఇప్పుడు ఆమె ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి ఆ వ్యక్తిని వెతికి పెట్టేందుకు సహకరించాలని కోరుతోంది. తెలిస్తే తనకు ట్యాగ్ చేయాలని వేడుకుంటోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో దినారా భారతీయ భర్త కోసం వెతుకుతోంది
ఇలా సోషల్ మీడియాలో హెల్ప్ అడగడ ఇదే మొదటిసారి కాదు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో "భారతీయ భర్త కోసం సెర్చింగ్" అని రాసుకున్నారు, దీనికి కామెడీ ఇమోజీని కూడా జోడించింది. గత ఏడాది పోస్టు చేసిన ఒక వీడియోలో ఆమె మాల్‌లో ఎరుపు చీర కట్టుకుని కనిపించింది, అక్కడ ఆమె చేతిలో QR కోడ్ కూడా ఉంది. ఈ కోడ్ నేరుగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు లింక్ చేసి ఉంది. దీని ద్వారా ప్రజలు ఆమెకు DM చేయవచ్చు. ఆమె "భారతీయ భర్త కోసం సెర్చ్ చేస్తున్న. DM చేయండి!" అని రాసి ఉంది.