Russia Ceasefire: 


కాల్పుల ఉపసంహరణ..


రష్యాను నమ్మడానికి వీల్లేదు అంటున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. క్రిస్మస్ సందర్భంగా పుతిన్ కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నారని రష్యా వెల్లడించింది.  ఉక్రెయిన్‌లో ఎక్కడా కాల్పులు జరపడానికి వీల్లేదని పుతిన్ ఆదేశించినట్టు చెప్పింది. జనవరి 6న (నేడు) దాదాపు 12 గంటల పాటు గన్‌ ఫైరింగ్ చేయకూడదని పుతిన్ చెప్పారని, అందుకే ఈ నిర్ణయం అమలు చేస్తున్నామని రష్యా ప్రతినిధులు స్పష్టం చేశారు. జనవరి 6, 7వ తేదీల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్‌లోనూ క్రిస్టియన్లు క్రిస్‌మస్ వేడుకలు చేసుకుంటారు. రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్‌ హెడ్‌ విజ్ఞప్తి రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై జెలెన్‌స్కీ మండి పడుతున్నారు. ఇది సానుభూతితో చేసిన పనేమీ కాదని...అదనపు బలగాలను మొహరించేందుకు...విరామం తీసుకున్నారని, దానికి కాల్పుల విరమణ అని పేరు పెట్టారని విమర్శించారు. "తూర్పు డాన్‌బాస్ ప్రాంతంలో మా ఆధిపత్యాన్ని అణిచేందుకు అదనపు బలగాలు, ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు. దీనికి కాల్పుల విరమణ అని కవర్ చేస్తున్నారు" అని ఆరోపించారు. దీని వల్ల కలిగే ప్రయోజనమేమీ లేదని, మళ్లీ రష్యా దాడులు కొనసాగుతాయని..ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారని అసహనం వ్యక్తం చేశారు జెలెన్‌స్కీ. రష్యా చెప్పే మాటలు నమ్మలేమని ఉక్రెయిన్ మండి పడుతోంది. 


వింటర్ బ్రేక్..?


దాదాపు 50 వేల మంది సైనికులను యుద్ధ రంగంలో మొహరించినట్టు పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. మరో రెండున్నర లక్షల మందిని సిద్ధం చేసి ఎప్పుడైనా ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తామన్న సంకేతాలిస్తున్నారు. అయితే...ఇప్పుడు శీతాకాలం కావడం వల్ల యుద్ధరీతిలో ఎన్నో మార్పులు వచ్చే అవకాశముందంటున్నారు నిపుణులు. ఇప్పటికే రష్యన్ సైనికులు చలి కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే...రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏ మలుపు తీసుకోనుందన్న ఉత్కంఠ పెరుగుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ విజయం మనదే అంటూ న్యూ ఇయర్ స్పీచ్‌లో సైనికులకు ధైర్యం నూరిపోశారు. అటు ఉక్రెయిన్ శాంతియుతంగా సమస్యను పరిష్కరించు కోడానికి చూస్తున్నా..యుద్ధ రంగంలో మాత్రం రష్యన్ సేనలతో గట్టిగా పోరాడుతోంది. ఇది ఓ కొలిక్కి వచ్చే వరకూ ఉక్రెయిన్ సైన్యం అస్త్ర సన్యాసం చేయదమని స్పష్టం చేసింది. ఈ వాడివేడి వాతావరణంలో చర్చలకు అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. పూర్తిగా ఓ పక్షం వెనక్కి తగ్గితే తప్ప యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు. ఉక్రెయిన్‌ ఆక్రమణకు వాతావరణ పరిస్థితులు మాత్రం రష్యాకు కళ్లెం వేస్తున్నాయి.  అందుకే...చలికాలం పూర్తయ్యే వరకూ వేచి చూసి మళ్లీ యుద్ధం కొనసాగించే అవకాశాలున్నాయి. ఇక్కడే మరో విషయమూ మాట్లాడుకోవాలి. ఒకవేళ రష్యా చలి కాలం కారణంగా వెనక్కి తగ్గితే...అప్పుడు ఉక్రెయిన్ పుంజుకునే అవకాశముంది. రష్యా అధీనంలోని డోన్‌బాస్ ప్రాంతాన్ని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకోడానికీ ప్రయత్నం చేస్తుండొచ్చు. ఒకవేళ ఉక్రెయిన్‌ రష్యాపై అగ్రెసివ్‌గా అటాక్ చేస్తే మాత్రం...మళ్లీ రష్యా గట్టిగా దెబ్బ కొట్టేందుకు ముందుకొస్తుంది. మళ్లీ కథ మొదటికే వస్తుంది. 


Also Read: Vladimir Putin Girlfriend: పుతిన్‌తో అంత చనువుగా ఉన్న ఆ మహిళ ఎవరు? ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారా?