Russia Luna-25 Moon Mission:


రష్యా లూనా 25 మూన్ మిషన్ విఫలమైంది. చంద్రుడిపై దిగే క్రమంలో క్రాష్ అయినట్టు బలంగా ఢీకొట్టడం వల్ల మిషన్ ఫెయిల్ అయింది. ఆగస్టు 11న ఈ Russia Luna-25 Moon Mission లాంఛ్‌ చేసింది రష్యా. ఆగస్టు 21న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవ్వాల్సి ఉన్నా...ఢీకొట్టడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. రష్యా స్పేస్ కార్పొరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం...రోబో ల్యాండర్ అన్‌కంట్రోల్డ్ ఆర్బిట్‌లోకి ప్రవేశించి క్రాష్ అయింది. "రోబో ల్యాండర్ అనుకోకుండా ఓ ఆర్బిట్‌లోకి ఎంటర్ అయ్యింది. ఆ తరవాత చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది" అని వెల్లడించింది. Roscosmos హెడ్ యురి బొరిసోవ్ జూన్‌లోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. లూనార్ మిషన్స్‌ చాలా రిస్క్‌తో కూడుకుని ఉంటాయని, సక్సెస్ రేట్ 70% మాత్రమే ఉంటుందని వెల్లడించారు. ఆ అనుమానానికి తగ్గట్టుగానే ఈ మిషన్ ఫెయిల్ అయింది. భారత్ చంద్రయాన్ 3తో పాటు రష్యా లూనా 25 మిషన్ కొనసాగింది. అయితే...ఆగస్టు 19న లూనా 25 స్పేస్‌క్రాఫ్ట్‌లో టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. అప్పటి నుంచి దీనిపై అంచనాలు తలకిందులయ్యాయి. రష్యా స్పేస్ ఏజెన్సీ ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించింది. అటు చంద్రయాన్ 3 చంద్రుడికి దగ్గర్లో ఉండటం ఉత్కంఠ రేపుతోంది. లూనా 25 మిషన్ ఫెయిల్ అయిన నేపథ్యంలో చంద్రయాన్ 3పై అంచనాలు భారీగా పెరిగాయి.