PM Modi Papua New Guinea Visit: జపాన్‌లో జరిగిన జీ-7, క్వాడ్ సమావేశాలకు హాజరైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (మే 21) పపువా న్యూ గినియా చేరుకున్నారు. మూడు దేశాలలో ముఖ్యమైన పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (మే 22) పపువా న్యూ గినియాలో పలు ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.  అయితే ప్రధాని మోదీ విమానాశ్రయానికి చేరుకోగానే... పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే ఆయన పాదాలను తాకి స్వాగతం పలికారు. దీనిపై ప్రధాని మోదీ జేమ్స్ మరాపేను కౌగిలించుకుని అభివాదం చేశారు. పపువా న్యూ గినియాను సందర్శించిన తొలి భారత ప్రధాని ప్రధాని మోదీయే. అక్కడే ఉన్న భారతీయులను కూడా ప్రధాని కలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగానే ప్రధాని అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. 






పుపువా న్యూ గినియాలో ప్రధాని మోదీ షెడ్యూల్..!


భారత కాలమానం ప్రకారం పపువా న్యూ గినియాలో ప్రధాని మోదీ నేటి షెడ్యూల్ ఇలా ఉంది. ఉదయం 4.15 గంటలకు ప్రధాని మోదీ ప్రభుత్వ నివాసానికి చేరుకున్నారు. 4.15 టలకు పుపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ డేడ్‌తో సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అంటే 4.45 గంటలకు ఏపీఈసీ హౌస్‌కి చేరుకున్నారు. ఉదయం .45 నుండి 5.25 వరకు పుపువా న్యూ గినియా ప్రధాన మంత్రి జేమ్స్ మరాపేతో ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఉదయం 6 గంటలకు పసిఫిక్ ద్వీప దేశాల నాయకులు వచ్చారు. 6.05 నుండి 6.15 వరకు పుపువా న్యూ గినియా నాయకులతో ఫొటోలు దిగారు. ఉదయం 6.15 నుండి 7.40 వరకు ఫోరమ్ ఫర్ ఇండియా - పసిఫిక్ ఐలాండ్స్ కో-ఆపరేషన్ (FIPIC) యొక్క 3వ సమ్మిట్‌ను సంయుక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో చైనాను నియంత్రించడానికి ద్వీప దేశాలతో నిర్మాణాత్మక సహకారాన్ని ప్రోత్సహించడానికి ప్రధాని మోదీ ప్రయత్నించారు.






ఉదయం 11.20 గంటలకు ఆస్ట్రేలియాకు


ఉదయం 7.55 నుండి 8.55 వరకు అల్పాహారం తీసుకున్నారు. మిగతా నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఉదయం 9 నుండి 9.30 వరకు ఫిజీ ప్రధాన మంత్రి సితివేని రబుకాతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 9.45 గంటలకు ఎయిర్‌వేస్ హోటల్‌కి చేరుకున్నారు. ఉదయం 10.10 నుండి 10.30 వరకు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ జాన్ హిప్కిన్స్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఉదయం 10.40 నుండి 11.10 వరకు ఐటీఈసీ పండితులను కలుసుకుని సంభాషిస్తారు. 11.20 గంటలకు ఆస్ట్రేలియాకు బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు సిడ్నీ కింగ్స్‌ఫోర్డ్ స్మిత్ విమానాశ్రయానికి చేరుకుంటారు.