Pakistan people begging : పాకిస్తాన్‌లో ఆర్గనైజ్డ్ భిక్షాటన మాఫియాను అరికట్టేందుకు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) చేపట్టిన క్రాక్‌డౌన్‌లో 2025లో 66,154 మంది ప్రయాణికులను విమానాల్లో ఎక్కకుండా ఆఫ్‌లోడ్ చేశారు. ఇది గత ఏడాది (35,000)తో పోలిస్తే భారీగా పెరిగింది. ఈ చర్యలు పాకిస్తాన్ అంతర్జాతీయ ఇమేజ్‌ను రక్షించడానికి తప్పనిసరి అని FIA అధికారులు చెబుతున్నారు.
FIA డైరెక్టర్ జనరల్ రిఫత్ ముఖ్తార్ రాజా నేషనల్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీకి తెలిపిన వివరాల ప్రకారం, ఆఫ్‌లోడ్ చేసినవారిలో 51,000 మంది ట్రావెల్ డాక్యుమెంట్లు అనుమానాస్పదంగా ఉండటం వల్ల అడ్డుకున్నారు. ప్రధానంగా వర్క్ వీసా, టూరిస్ట్ వీసా, ఉమ్రా వీసాలతో వెళ్తున్నవారు భిక్షాటనకు వెళ్తున్నట్టు అనుమానం రావడమే కారణం. సౌదీ అరేబియా నుంచి 2025లో 56,000 మంది పాకిస్తానీలను భిక్షాటనకు పాల్పడినందుకు డిపోర్ట్ చేశారు. యూఏఈ 6,000 మందిని, అజర్‌బైజాన్ 2,500 మందిని తిరిగి పంపింది. ఈ భిక్షాటన మాఫియా వల్ల పాకిస్తాన్ పాస్‌పోర్ట్ విలువ పడిపోతోందని, అనేక దేశాలు వీసా ఆంక్షలు విధిస్తున్నాయని FIA అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా, ఉమ్రా మరియు హజ్ వీసాలను దుర్వినియోగం చేసుకుని భిక్షాటన చేస్తున్న పాకిస్తానీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ సమస్య వల్ల నిజమైన పిల్గ్రిమ్స్, వర్కర్స్, స్టూడెంట్స్ వీసాలు పొందడం కష్టమవుతోంది. యూఏఈ వీసా ఆంక్షలు విధించింది. ఈ క్రాక్‌డౌన్ వల్ల పాకిస్తాన్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ 118 నుంచి 92కి మెరుగైందని FIA చెబుతోంది. యూరప్‌కు అక్రమ వలసలు కూడా తగ్గాయని చెబుతున్నారు.
2025లో మొత్తం 85 లక్షల మంది పాకిస్తానీలు విదేశాలకు ప్రయాణించారు. 226 కేసులు నమోదయ్యాయి. కంబోడియాకు 24,000 మంది టూరిస్ట్ వీసాలతో వెళ్లగా, సగం మంది తిరిగి రాలేదు. మయన్మార్‌కు వెళ్లిన 4,000లో 2,500 మంది మిస్సింగ్. ఆఫ్‌లోడింగ్‌లు ఎక్కువగా లాహోర్, కరాచీ ఎయిర్‌పోర్టుల్లో జరిగాయి. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఆఫ్‌లోడింగ్ ఫిర్యాదులు రావడంతో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఓ కొలిక్కి తేవడానికి 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ భిక్షాటన సమస్య పాకిస్తాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద సిగ్గుచేటుగా మారింది. నిజమైన ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నందున FIA చర్యలు కీలకమవుతున్నాయి.