Imran Khan Gets Bail: 



అల్‌ఖదీర్ ట్రస్ కేసులో బెయిల్ 


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు ఊరటనిచ్చింది. రెండు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టు ప్రకటించింది. అల్‌ఖదీర్ ట్రస్ట్ కేసులో (Al-Qadir Trust case) బెయిల్ ఇచ్చింది. మే 17వ తేదీ వరకూ ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడానిలి వీల్లేదని తేల్చి చెప్పింది. త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య కోర్టులో హాజరయ్యారు ఇమ్రాన్ ఖాన్. ఈ విచారణ జరుగుతుండగానే..ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "నన్ను మళ్లీ ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లినా తీసుకెళ్తారు" అంటూ అసహనం వ్యక్తం చేశారు. భద్రతా కారణాల వల్ల విచారణ రెండు గంటల పాటు ఆలస్యమైంది. సెక్యూరిటీ కాన్వాయ్‌తో కోర్టుకు వచ్చారు ఇమ్రాన్. పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. చాలా రోజులుగా న్యాయపోరాటం చేస్తున్న ఇమ్రాన్‌కు ఈ తీర్పుతో ఉపశమనం కలిగింది. ఆ తరవాత ఆయన స్పందించారు. కోర్టులో గంటల పాటు కూర్చోవాల్సి వచ్చిందని, ఏ తప్పూ చేయకుండానే తనను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటవిక చట్టాలు రాజ్యమేలుతున్నాయంటూ మండి పడ్డారు. దేశంలో మార్షియల్ లా విధించినట్టు అనిపిస్తోందని ఫైర్ అయ్యారు.