మరణం గురించి మనకు మందుగానే తెలుస్తుందా? మన కళ్లకు ఏం కనిపిస్తాయి?

Near-Death Experience: మరణం సమీపిస్తున్నప్పుడు మనకు ముందుగానే తెలుస్తుందని ఓ అధ్యయనం చెబుతోంది.

Continues below advertisement

Near-Death Experience: 

Continues below advertisement

మరణం సమీపిస్తున్నడు ముందుగానే మనకు కొన్ని సంకేతాలు అందుతాయని ఓ అధ్యయనం చెబుతోంది. ఇందుకు 80 ఏళ్ల ఆబ్రే ఓస్టీన్ అనే వ్యక్తి ఉదంతాన్ని ఉదాహరణగా చెబుతున్నారు పరిశోధకులు. మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు అనుభవాల గురించి దశాబ్దాలుగా పరిశోధన చేసిన NYU లాంగోన్ హెల్త్ ఇంటెన్సివ్ కేర్ వైద్యుడు డాక్టర్ సామ్ పర్నియా తన అనుభవాలను తెలిపారు. చనిపోతున్నప్పుడు వ్యక్తి అనుభవాలు ఎలా ఉంటాయి. అదే వ్యక్తి తిరిగి ప్రాణం పోసుకుంటే ఎలా ఉంటుంది అనే విషయాలపై చర్చించారు.

ఇందుకు ఓ ఘటనను ఉదహరించారు. 2020 డిసెంబర్‌లో గుండెపోటు వచ్చిన 80 ఏళ్ల ఆబ్రే ఓస్టీన్‌ తన మరణ అనుభవాన్ని పంచుకున్నారు. తన చాతీ కోశారని, తనకు ఇంకొంచెం అనస్థీషియా ఇవ్వాలని కోరానని, తన పక్కటెముకను వేరు చేశారని చెప్పారు. తన శరీరం టేబుల్‌పై తేలుతున్నట్లు అనిపించిందన్నారు. తాను చనిపోయినట్టు అనిపించిందని, అనస్థీషియా ఇవ్వాలని తాను కోరిన మాటలు డాక్టర్లు వినలేరని చెప్పారు. ఆ సమయంలో ఒక్కసారిగా మెలకువ వచ్చినట్టు అనిపించిందని, దేవుని సన్నిధిలోనే ఉన్నట్టు ఫీల్ అయ్యానని వివరించారు.  భూమిపై తానెప్పుడు అలాంటి కాంతి చూడలదేన్నారు. తనకు ఓదార్పునివ్వడానికి ఎవరో ఓ దేవదూత వచ్చినట్టు కూడా తనకు అనిపించిందని 82 ఏళ్ల ఓస్టీన్ పేర్కొన్నారు. మరణానికి దగ్గరగా ఉన్నామన్న ఊహలో మన శరీరం నుంచి మనం వేరైపోయినట్టు అనిపిస్తుందని వివరించారు ఓస్టీన్. ఇలాంటి సమయంలోనే జీవితంలో జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు వస్తాయని, ఓసారి లైఫ్‌ని రివ్యూ చేసుకుంటారని చెప్పారు. ఈ టైమ్‌లో చుట్టూ అంతా వెలుగే ఉన్నట్టు అనిపిస్తుందని అన్నారు. కొందరు దేవుడు లాంటి వ్యక్తిని చూశానని చెబుతారని, క్రైస్తవులైతే జీసస్‌ని చూశానని అంటారని, నాస్తికులైతే, నేను మరేదైనా చూశానని అని అంటారని పర్నియా చెప్పారు. 

Continues below advertisement