DOGE backfires as hundreds are begged to return to work: అమెరికా అధ్యక్షుడు ఎలాన్ మస్క్ ఖర్చులు తగ్గించుకోవడానికి అధికారం చేపట్టగానే డోజ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి ఉద్యోగుల్ని తొలగించారు. ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలో ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషెన్సీ (DOGE) తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రివర్స్ టర్న్ తీసుకుంటున్నాయి. ఫెడరల్ గవర్నమెంట్‌లోని వందలాది ఉద్యోగులు, ఎలాన్ మస్క్ కాస్ట్-కట్టింగ్ ప్రయత్నంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిని తిరిగి ఉద్యోగానికి వస్తే అనుమతించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వేడుకుంటోంది. జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (GSA)లోని మాజీ ఉద్యోగులను చేర్చుకోవడానికి ఇంటర్నల్ మెమో జారీ చేసింది.
DOGE అనేది డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి నేతృత్వంలో 2025 జనవరిలో ప్రారంభించిన కాస్ట్ కటింగ్ ప్రయత్నం. ఫెడరల్ గవర్నమెంట్‌లో వృధాను తగ్గించి, ట్రిలియన్ డాలర్లను ఆదా చేయాలని లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. మస్క్ DOGE ద్వారా వేలకొద్దీ ఉద్యోగాలను తగ్గించారు. జీఎస్‌ఏ విభాగంలో ఉద్యోగుల్లో 79 శాతం హెడ్‌క్వార్టర్స్ స్టాఫ్, 65 శాతం పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, 35 శాతం ఫెసిలిటీస్ మేనేజర్లను తొలగించారు. GSA హెడ్‌క్వార్టర్స్‌లో లీజుల్ని కూడా సగం క్యాన్సిల్ చేశారు. డోజెన్స్ ఆఫ్ బిల్డింగ్స్ విక్రయించాలని ప్లాన్ చేశారు.
అయితే ఇప్పుడు ఇప్పుడు అంతా రివ్స్ అయిపోయింది. ఉద్యోగులు లేకపోవడంతో పనులు జరగడం లేదు. విధుల్లో కన్‌ఫ్యూజన్‌తో పాటు ఖర్చులు పెరిగాయి. అందుకే ఇప్పుడు తీసేసిన ఉద్యోగులు మళ్లీ విధుల్లోకి వస్తే వెంటనే ఉద్యోగం ఇవ్వాలని మెమో ఇచ్చారు. క్యాన్సల్ చేసిన ప్రాపర్టీస్‌ను మెయింటైన్ చేయడానికి డబ్బులు ఖర్చయ్యాయి. IRS, లేబర్ డిపార్ట్‌మెంట్, నేషనల్ పార్క్ సర్వీస్‌లో కూడా రీహైరింగ్ జరుగుతోంది. చాలా మందికి ఈమెయిల్స్ పంపారు. GSA మెమో ప్రకారం, మాజీ ఉద్యోగులు వారాంతంలోపు ఉద్యోగంలో చేరడానికి అక్సెప్ట్ లేదా డిక్లైన్ చేస్తూ రిప్లై ఇవ్వాలి. ఉద్యోగంలో చేరాలనుకుంటే అక్టోబర్ 6 నుంచి రిపోర్ట్ చేయాలి – 7 నెలల పెయిడ్ వేకేషన్ తర్వాత చాలా మంది వాలంటరీ రెసిగ్నేషన్ తీసుకున్నారని GSA అధికారులు చెబుతున్నారు.
DOGE ఉద్యోగాల తొలగింపు దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. మస్క్ మే 2025లో DOGE నుంచి వెళ్లిపోయారు. ఉద్యోగుల్ని మళ్లీ తీసుకుంటూ ఉడటంతో "DOGE ఫెయిల్యూర్" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్‌నాయి. ఈ రీహైరింగ్ GSA మాత్రమే కాదు, ఇతర ఏజెన్సీల్లో కూడా జరుగుతుంది.