300 people dead in Pakistan: పాకిస్తాన్‌లోని ఉత్తర , వాయవ్య ప్రాంతాల్లో క్లౌడ్ బరస్టుల వల్ల సంభవించిన ఆకస్మిక వరదలు , కొండచరియలు (landslides) విరిగిపడటం వంటి కారణాల వల్ల 300 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది గల్లంతయ్యారు. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా (KP), పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ( POK), గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలోనే 307 మరణాలు నమోదయ్యాయి. ఇందులో 279 పురుషులు, 15 మహిళలు, 13 మంది పిల్లలు ఉన్నారు. బునర్ జిల్లా అత్యంత దారుణంగా ప్రభావితమైంది. పాకిస్తాన్ ఆక్రమితకాశ్మీర్ , గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతాల్లోనూ భారీగా రమణాలు నమోదయ్యాయి. గల్లంతయిన వారి సంఖ్య వేలలలో ఉంటుందని చెబుతున్నారు. వరదలు వచ్చినా ప్రభుత్వం స్పందించలేకపోతోంది. సహాయ కార్యక్రమాలను మందకొడిగా చేపడుతున్నారు. గ్రామాలకు గ్రామాలు తుడిచి పెట్టుకుపోయాయి. రోడ్లు, వంతెనలు, మరియు మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
బజౌర్‌లో రిలీఫ్ సామాగ్రిని తీసుకెళ్తున్న ఒక మిలిటరీ హెలికాప్టర్ (Mi-17) కూలిపోయింది. ఇందులో ఇద్దరు పైలట్లతో సహా 5 మంది సిబ్బంది మరణించారు. సహాయ కార్యక్రమాలను పాకిస్తాన్ ఆర్మీ కూడా సరిగ్గా డీల్ చేయలేకపోతోంది.
100 మిలీమీటర్లకు పైగా ఒక గంటలో కురిసే వర్షాన్ని క్లౌడ్ బరస్ట్ అంటున్నారు. హిమాలయ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు మరియు కొండచరియలకు దారితీస్తున్నాయి. శాస్త్రవేత్తలు ఈ ఘటనల తీవ్రత , ఫ్రీక్వెన్సీ వాతావరణ మార్పుల (climate change) వల్ల పెరిగాయని చెబుతున్నారు. ఇవి హిమాలయ ప్రాంతాల్లో కుండపోత వర్షాలను మరింత పెంచుతున్నాయి. పాకిస్తాన్ భూభాగంలో చైనా చాలా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. అవి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.