Bad Teacher: టీచర్లు అందరూ మంచి వాళ్లు కాదు. కొంత మంది ఘోరమైన టీచర్లు ఉంటారు. ఇలాంటి వారు అమెరికాలో కాస్త ఎక్కువగా ఉంటారు. మిస్సోరిలోని ఓ స్కూల్ టీచర్ అయితే పూర్తిగా హద్దు దాటిపోయారు. విద్యార్థులను తనతో శృంగారం చేయించుకుని వారికి డ్రగ్స్, డబ్బులు ఇస్తోంది. ఎందుకంటే ఎవరికీ చెప్పవద్దని.
మిస్సోరి రాష్ట్రంలో డిక్సన్ డిస్ట్రిక్ట్ స్కల్లో పని చేస్తున్న కారిస్సా స్మిత్ అనే టీచర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై మొత్తం 19 అభియోగాలు మోపారు. చిన్న పిల్లలతో సెక్స్ చేయడం, రేప్ చేయడం వంటి నేరాలను పోలీసులు నిర్దారించారు. నేరుగా శృంగారం లేదా ఓరల్ సెక్స్ చేసిన వారికి వంద డాలర్లు ఇస్తోంది. ఇదంతా తన ఇంట్లో లేదా కారులో చేసింది. పోలీసులకు ఫిర్యాదు వచ్చిన తర్వాత అక్కడి విద్యార్థులను ప్రశ్నించిన పోలీసులకు సంచలనాత్మక విషయాలు తెలిశాయి.
స్మిత్ స్కూల్లో పూర్తి స్థాయి టీచర్ కాదు. సబ్స్టిట్యూట్ టీచర్ మాత్రమే. అంటే ఎవరైనా టీచర్ రాకపోతే ఆ క్లాసుకు వెళ్లి పాఠాలు చెబుతుంది. అలా పాఠాలు చెప్పడానికి వెళ్లిన క్లాసుల్లో కంటికి నుదురుగా కనిపించిన స్టూడెంట్స్ ను ఎంపిక చేసుకుని న్యూడ్ ఫోటోలు పంపుతూ రెచ్చగొడుతుంది. తర్వాత ఇంటికి ఆహ్వానిస్తుంది. లేకపోతే కారులోనే పని చేస్తుంది. తాను ఇలా చేశానని ఎవరితో చెప్పవద్దని.. ఎవరికైనా తెలిస్తే తనకు చాలా సమస్యలు వస్తాయని చెప్పి వంద డాలర్ల వరకూ ఇచ్చేదని అవి వద్దంటే డ్రగ్స్ ఇచ్చేదని పోలీసులు గుర్తించారు.
ఇలాంటి నేరం తమ స్కూల్లో జరిగిందని తెలిసి చాలా డిస్ట్రబ్ అయ్యామని స్కూల్ అధికారులు చెబుతున్నారు..గత రెండేళ్లుగా ఆమె స్కూల్లో పని చేస్తున్నట్లుగా ధృవీకరించారు. విద్యార్థులు గతంలో తమ దృష్టికి ఇలాంటి సమస్యలు తీసుకు రాలేదని చెబుతున్నారు. చిన్న పిల్లలను.. విద్యార్థులకు లైంగిక కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగించడమే కాకుండా వారికి డ్రగ్స్ కూడా అలవాటు చేయడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఆమెకు రేప్ సహా చాలా సెక్ష్షన్ల కింద కేసులు పెట్టారు.
Also Read:కెనడా మాదే తెల్లోళ్లు యూరోప్ వెళ్లిపోవాలి- ఖలీస్థానీ సపోర్టర్ల కొత్త డిమాండ్ ! తిక్క కుదిరినట్లే !
బాధితుల్ని ఇంకా విచారిస్తున్నామని .. ఆమె చేసిన నేరాలపై ఇంకా కొత్త వివరాలు వస్తే కొత్త కేసులు పెడతామని మిస్సోరి పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆడపిల్లలకే కాదు.. మగ పిల్లలకూ అమెరికాలో రక్షణ ఉండదని ఈ ఘటనతో తేలిపోయింది.