Trump and Musk Memes: అమెరికాలో ఇద్దరు మిత్రులు కాస్తా శత్రువులుగా మారారు. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తాను లేకపోతే ట్రంప్ గెలిచేవాడు కాదని ఎలాన్ మస్క్ అంటూంటే.. మస్క్ పీపీలికం అని ఆయన లేకపోయినా తాను గెలిచేవాడ్ని చెబుతున్నారు. తాజాగా ట్రంప్ ఓ సెక్స్ స్కాంలో ఉన్నాడని మస్క్ ఆరోపించారు. తాను కొత్త పార్టీ పెడతానని కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ముదురుతున్న వ్యవహారం యుద్ధంగా భావిస్తున్నారు.ఈ యుద్ధంపై మీమ్స్ వరద పారుతోంది.
వీరిద్దరి వ్యవహారం రియాలిటీ షో చూసినట్లుగా ఉందని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.
తాను భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నివారించానని ట్రంప్ ప్రకటించుకుంటున్నారు. ఇప్పుడు మోదీచాన్స్ తీసుకోవాలి.. ట్రంప్, మస్క్ ఇద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకోకుండా సీజ్ ఫైర్ చేయాలని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.
అసలు వీరిద్దరి మధ్య గొడవలు బిగ్ అండ్ బ్యూటిఫుల్ అనే బిల్లు వచ్చాయి. ఇప్పుడు నిజంగానే ఆ బిల్లు బిగ్ అండ్ బ్యూటీఫుల్ అని అమెరికన్ నెటిజన్లు అంటున్నారు.
ఈ అంశంపై మోదీచేసినట్లుగా ఉన్న ఓ ట్వీట్ వైరల్అయింది. అయితేఅది మార్ఫింగ్.
ఇద్దర్నీ జోకర్లుగా మారుస్తూ.. వందల కొద్దీ మీమ్స్, ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.