Mashco Piro Tribe Telugu News | ఇక్కడ నది ఒడ్డున అలా తిరుగుతూ కనిపిస్తున్నవాళ్లు, మనం ఉంటున్న ఈ బాహ్య ప్రపంచంతో సంబంధమే లేని ఓ ఆదిమ జాతి తెగ. పెరూలోని మనూ నేషనల్ పార్క్ లో అమెజాన్ డీప్ ఫారెస్ట్ లో ఉండే వేటగాళ్ల తెగ ఇది. వీళ్లను మాషో పైరో తెగ (Mashco Piro Tribe) అంటారు.  




కొన్ని దశాబ్దాల క్రితం మాషో పైరోలను బాహ్య ప్రపంచంతో కలిపేలా ఇక్కడ ప్రదేశాలను ఖాళీ చేసేలా చాలా దారుణాలు జరిగాయి. అప్పుడు వీరి సంఖ్య 20కి పడిపోయింది.  అందుకే అప్పటి నుంచి ఈ తెగ బయటి వ్యక్తులను ఎవ్వరినీ రానీయకుండా వేటగాళ్లుగా తము సాగించే ప్రవృత్తిని కొనసాగిస్తూ బతుకుతోంది. అయితే ఇప్పుడు ఎవరూ ఇక్కడ ఉండటం లేదని ఈ ప్రాంతమంతా ఇప్పుడు నిర్మానుష్యమైపోయిందని అందుకే ఇక్కడ ఓ కంపెనీ పెట్టుకుంటామంటూ ఓ ప్రైవేట్ సంస్థ చెట్లను నరికివేసేందుకు పెరూ నుంచి అనుమతులు పొందింది. అయితే ఇక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ నివసించే ఆదిమజాతి తెగ ఇంకా అక్కడే బతికి ఉందని నిరూపించేలా ఈ సాక్ష్యాలను బయటపెట్టింది సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ.



గిరిజనులు, ఆదివాసీల కోసం ఈ సంస్థ పోరాడుతూ ఉంటుంది. అలా ఈ విజువల్స్ ను విడుదల చేసింది. ఇంకా ఈ వీడియోలో మనకు వినిపిస్తున్న మాటలను పైరో లాంగ్వేజ్ అంటారు. ఈ ఆదిమతెగ మాట్లాడే భాష ఇది. అంతరించిపోయే దశలో ఉన్న ఈ తెగ ప్రజలను కాపాడాలని..వీళ్లకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్లను స్వేచ్ఛగా వదిలేయాలని సర్వైవల్ ఇంటర్నేషనల్ ఓ ఉద్యమాన్ని లేవనెత్తింది.