North Korea Nuclear Weapons: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమను రెచ్చగొడితే అణు బాంబులు ఉపయోగిస్తామని అమెరికాను హెచ్చరించారు కిమ్. ఉత్తర కొరియా ఆర్మీ.. 90వ వ్యవస్థాపక దినోత్సంలో తమ ఆయుధ సంపత్తిని లోకానికి చాటింది. రాజధాని ప్యాంగ్యాంగ్‌లో జరిగిన ఈ పరేడ్‌లో కిమ్ పాల్గొన్నారు. పరేడ్‌లో తమ అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శించారు. ఇందులో భారీ అణ్వాయుధాలు, క్షిపణులు ఉన్నాయి.
దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ ఈ పరేడ్‌లో రొటీన్‌కు భిన్నంగా ప్రత్యేక దుస్తులతో ఆకర్షణీయంగా కనిపించారు. కిమ్ వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు. తమ దేశం ఆంక్షల నుంచి మినహాయింపులు పొందడమే లక్ష్యంగా అణు పరీక్షలు కొనసాగిస్తోందని కిమ్ పరేడ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.
ఉత్తర కొరియా ఇటీవల కాలంలో జోరుగా క్షిపణి పరీక్షలు చేస్తోంది. ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు గత నెల ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కిమ్ కాస్త సైలెంట్‌గా ఉన్నారు. కానీ బైడెన్ అధ్యక్షుడైన తర్వాత కిమ్ జోరు పెంచారు.. వరుసగా క్షిపణి ప్రయోగాలు చేస్తున్నారు.