Japan Sleeper Train: సామాజిక మాధ్యమాలలో విదేశీ రైళ్ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా, ప్రజలు తరచుగా వాటి పరిశుభ్రత, సమయపాలన, ఆధునిక సౌకర్యాల గురించి చర్చిస్తారు. అయితే, ఒక వీడియో వైరల్ అవుతోంది, ఇది భారతీయ సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆలోచింపజేసింది. ఈ వీడియో జపాన్ స్లీపర్ రైలుకు సంబంధించినదని చెబుతున్నారు, ఇక్కడ సౌకర్యాలు లగ్జరీ హోటల్ కంటే తక్కువ కాదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రైలు ప్రయాణం ఒక భారతీయుడు షూట్ చేశాడు. అతను వీడియో ద్వారా మొత్తం కోచ్ వివరాలను ప్రజలకు చూపించాడు. వీడియో చూసిన తర్వాత, ప్రజలు దానిపై కామెంట్స్ చేస్తూ ఇది నిజమా ఏఐ మాయా అని అంటున్నారు. 

Continues below advertisement

Continues below advertisement

జపాన్ రైలును చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు

ఈ వైరల్ వీడియో జపాన్ స్లీపర్ రైలు లోపలి భాగాన్ని చూపిస్తుంది. వీడియో పొడవైన, శుభ్రమైన కారిడార్‌తో ప్రారంభమవుతుంది. రెండు వైపులా స్లీపర్ బెర్త్‌లు కనిపిస్తున్నాయి. అవి చాలా జాగ్రత్తగా  రూపొందించారు. ప్రతి బెర్త్ అత్యంత ప్రైవసీగా సిద్ధం చేశారు. ఇలా చేయడం వల్ల ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా విశ్రాంతి తీసుకోవచ్చు. రైలు లోపలి భాగం చాలా విశాలంగా లేనప్పటికీ, తయారు చేయడంలో మాత్రం చాలా సజనాత్మకతతో రూపొందించారు. ప్రతి అంగుళాన్ని జాగ్రత్తగా ఉపయోగించారు. బెర్త్‌లు చెక్కతో తయారు  చేశారు. ఇది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ప్రతి బెర్త్‌లో మెట్లు, హ్యాండ్‌రైల్స్,  లైట్లు ఉన్నాయి, తద్వారా ప్రయాణికులు సులభంగా పైకి, క్రిందికి దిగవచ్చు.

స్లీపర్లలో కూడా అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి

ప్రతి ప్రయాణీకుడి కోసం ప్రత్యేకమైన స్లీపింగ్ ఏరియా ఉన్నట్టు వీడియోలో వివరించాడు, ఇది శుభ్రమైన పరుపులు, దిండ్లు,  దుప్పట్లతో ఉంటుంది. బెర్త్‌ల లోపల ఛార్జింగ్ పాయింట్లు, చిన్న అల్మారాలు, లైట్లు కూడా ఉన్నాయి. అంటే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర పరికరాలను సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. తాగునీటి కోసం కప్పులు, బయటకు చూసేందుకు మంచి వ్యూ ఉండేలా కిటికీ అమర్చారు.  

"ఇది ఒక కలలా ఉంది" అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

@ASwatntra అనే ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ వీడియోకు లక్షల వ్యూస్ వచ్చాయి, చాలా మంది ఈ వీడియోను లైక్ చేస్తున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా రాశాడు, "ఇది ఒక కలలా ఉంది, జపాన్ చాలా ముందుకు వెళ్లింది." మరొకరు ఇలా కామెంట్ చేశారు, "అభివృద్ధి పరంగా జపాన్‌తో పోటీ లేదు." మరొక వినియోగదారు ఇలా చెప్పుకొచ్చాడు , "జపాన్ రైళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి."