Israel Gaza War:

 17 మంది విడుదల..

Gaza News Today: ఇజ్రాయేల్‌తో కుదిరిన డీల్‌లో (Israel-Hamas Truce) భాగంగా హమాస్‌ ఉగ్రవాదులు తమ అదుపులో ఉన్న బందీలను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే 17 మంది బందీలకు (Hamas Hostages) విముక్తి కల్పించారు. వీళ్లలో 14 మంది ఇజ్రాయేల్ పౌరులుండగా...నలుగురు థాయ్‌ వాసులున్నారు. ఒప్పందంలో భాగంగా నాలుగు రోజుల పాటు యుద్ధానికి విరామమిచ్చారు. ఇప్పటికే ఓ విడతలో బందీలను అప్పగించిన హమాస్...ఇప్పుడు మరో 17 మందిని రెడ్‌క్రాస్‌కి అప్పగించింది. ఈ నాలుగు రోజుల్లో మొత్తం 50 మంది ఇజ్రాయేల్ పౌరులను అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు బదులుగా ఇజ్రాయేల్‌ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. Israeli Defence Forces (IDF) బందీలను అప్పగించిన వీడియోని ట్విటర్‌లో షేర్ చేసింది. బందీలను స్వాగతించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. 

"హమాస్ ఉగ్రవాదులు ఇప్పుడే 17 మంది పౌరులను తిరిగి అప్పగించారు. ఈజిప్ట్‌ ద్వారా వీళ్లను తీసుకొచ్చింది. వీళ్లలో 13 మంది ఇజ్రాయేల్‌ పౌరులు, నలుగురు థాయ్ వాసులున్నారు. ఇజ్రాయేల్‌లోని హాస్పిటల్స్‌ని సిద్ధం చేశాం. వాళ్లు రాగానే మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తాం. వాళ్ల కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. అందరు బందీలను సురక్షితంగా ఇళ్లకు పంపుతాం"

- ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్

తొలి విడతలో 25 మంది విడుదల..

ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా హమాస్ ఉగ్రవాదులు 25 మందిని విడుదల చేసింది. వీళ్లలో 13 ఇజ్రాయేల్ పౌరులు, 12 మంది థాయ్ పౌరులున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయేల్‌పై దాడులు చేసిన రోజునే వీళ్లందరినీ కిడ్నాప్ చేశారు హమాస్ ఉగ్రవాదులు. విడుదలై వచ్చిన వెంటనే తమ కుటుంబ సభ్యుల్ని కలుసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అటు ఇజ్రాయేల్ కూడా పాలస్తీ ఖైదీల్ని విడుదల చేసింది. 39 మంది ఖైదీల్లో 33 మంది మైనర్లే ఉన్నారు. 

 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply