Israel Hamas War: మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంలో సీనియర్ హమాస్ నాయకుడు ఇజ్ అల్-దిన్ కసబ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) పేర్కొంది. IDF ప్రకారం... కస్సాబ్ హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు. గాజాలో హమాస్, ఇతర ఉగ్రవాద సంస్థల మధ్య సమన్వయం, సంబంధాలు పర్యవేక్షించే వ్యక్తిగా చెబుతున్నారు. ఇజ్రాయెల్‌పై దాడులకు సంబంధించి కీలక సూచనలు చేసే అధికారం కసబ్‌కు ఉంది.


కసబ్ మరణాన్ని ధృవీకరించిన హమాస్
కసబ్ మరణాన్ని హమాస్ ధృవీకరించింది. అయితే ఉన్నత పదవిని కలిగి ఉన్నాడనే ప్రచారాన్ని ఖండించింది. హమాస్‌లో కేవలం కార్యకర్తగా మాత్రమే ఉన్నాడని పేర్కొంది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య నెలకొన్న ఉద్రిక్తత మధ్య ఈ దాడి జరిగింది. ఇజ్రాయెల్ శుక్రవారం (1 అక్టోబర్ 2024) గాజాపై రెండు రాకెట్లను ప్రయోగించింది. IDF ప్రకారం... హమాస్ సీనియర్ అధికారి కస్సాబ్‌ను లక్ష్యంగా చేసుకొనే ఖాన్ యునిస్‌పై జరిపిన వైమానిక దాడి చేశారు.


Also Read: పుతిన్‌కు తోడవుతున్న కిమ్ - రష్యాకు సపోర్టుగా ఉత్తర కొరియా సైన్యం - ఏం జరుగుతుందో ?


గత నెలలో ఇజ్రాయెల్‌పై 4,400 పైగా క్షిపణులను హిజ్బుల్లా ప్రయోగించింది. 3,000 కంటే ఎక్కువ పేలుడు పరికరాలను, 2,500 యాంటీ ట్యాంక్ క్షిపణులు, రాకెట్-ప్రొపెల్డ్ గ్రెనేడ్‌లను గుర్తించి నిర్వీర్యం చేసినట్టు IDF పేర్కొంది. 


హిజ్బుల్లా లక్ష్యం ఎల్లప్పుడూ ఇజ్రాయెల్ - IDF
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 1,500 మందికిపైగా ఉగ్రవాదులను చంపినట్లు IDF తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లాకు వ్యతిరేకంగా నెల రోజుల పాటు జరుపుతున్న ఆపరేషన్ వివరాలను IDF  ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. లెబనాన్‌లోని ఒక పౌరుడి ఇంటిలో అడాల్ఫ్ హిట్లర్, నాజీ చిహ్నాల విగ్రహాన్ని గుర్తించినట్టు కూడా వెల్లడించింది. హిజ్బుల్లా లక్ష్యం ఎల్లప్పుడూ ఇజ్రాయెల్‌ను నాశనం చేయడమేనని వారి వాదనకు ఇవన్నీ నిర్దారించాయి.