Nobel Peace Prize 2023:
నోబెల్ శాంతి పురస్కారం
ఇరాన్‌కి చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మహమ్మదిని (Narges Mohammadi) అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం (Nobel Peace Prize) వరించింది. ఈ మేరకు అకాడమీ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించారు మహమ్మది. ఈ క్రమంలో జైలు శిక్ష కూడా అనుభవించారు. నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న 19వ మహిళగా రికార్డు సృష్టించారు. మానవ హక్కులపై పోరాటం చేయడంతో పాటు ఇరాన్‌లో అందరి స్వేచ్ఛ కోసం ఉద్యమించారు మహమ్మది. 11 మిలియన్ల స్వీడిష్ క్రోన్స్ (స్వీడన్ కరెన్సీ) విలువైన బహుమతిని అందించనున్నారు. డిసెంబర్ 10వ తేదీన ఓస్లోలో ఈ పురస్కారం అందజేస్తారు.