Iran Target Tech Companies: ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య సాగుతున్న ఘర్షణతో ప్రపంచం నలిగిపోతోంది. ఇప్పుడు ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ టెక్ దిగ్గజాలను టార్గెట్‌ చేయబోతున్నామని ఇరాన్ ప్రకటించింది. కేవలం ఇప్పటి వరకు సైనిక దళాలకే పరిమితం అయిన యుద్ధం ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న టెక్నాలజీ సంస్థల పేర్లను కూడా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటన వెలువడింది. ఇప్పుడు ఇరాన్ హిట్‌లిస్ట్‌లో యాపిల్, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, టెస్లా వంటి సంస్థలన్నీ ఉన్నాయి. 

Continues below advertisement

ఇరాన్ అధికారికంగా హెచ్చరిక 

అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసేందుకు ఈ సంస్థలు సహకరిస్తున్నాయని ఇరాన్ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఇవి కేవలం వ్యాపార సంస్థలు మాత్రమే కాదని, అమెరికాకు వెన్నుదన్నుగా మారుతున్నాయని ప్రకటించింది. అందుకే ఆయా సంస్థలను టార్గెట్ చేయబోతున్నట్టు ప్రకటించి ప్రపంచ మార్కెట్‌ను షేక్ చేసింది. 

ఎందుకు ఇరాన్ అనుమానపడుతోంది?

ఐర్జీసీ బిగ్రేడియర్‌ జనరల్‌, చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్ సలహాదారు జంషెడ్‌ ఇషాకీ అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందాడు. దీన్ని అధికారికంగా ప్రకటించిన ఇరాన్ తమసైనిక కమాండర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా టెక్నాలజీ కారణంగానే జరిగిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అందుకే అమెరికాకు చెందిన టెక్నాలజీ, ఆర్థిక సంస్థలను టార్గెట్ చేసుకున్నట్టు చెబుతోంది. వాటిని దెబ్బకొట్టాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టు ప్లాన్స్ వేస్తోంది. 

Continues below advertisement

ఇరాన్ హిట్‌లిస్ట్‌లో ఉన్న సంస్థలు

గూగుల్‌, యాపిల్, మైక్రోసాఫ్ట్‌, మెటా, టెస్లా, అమెజాన్/బోయింగ్, ఇంటెల్, ఎన్విడియా, డెల్, హెచ్‌పీ, సిస్కో, ఒరాకిల్, ఐబీఎం, పలలంటీర్, జేపీ మోర్గాన్, జనరల్‌ ఎలక్ట్రిక్‌, స్పైర్ సొల్యూషన్స్‌, జి42, ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ సంస్థలు తమ హిట్ లిస్ట్‌లో ఉన్నట్టు ఇరాన్ ఓపెన్‌గానే ప్రకటించింది. ఈ సంస్థలు తమ శక్తి సామర్థ్యాలను అమెరికాకు చేరవేస్తున్నాయని తెలిపింది. 

ఎలాంటి దాడులు జరగవచ్చు

ఇరాన్ తన సైబర్‌ దాడుల సామర్థ్యాన్ని ఇప్పటికే రుజువు చేసుకుంది. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే జరగవచ్చని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ సర్వర్లు, డేటా సెంటర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై సైబర్‌ దాడులు జరిగే ఛాన్స్ లేకపోలేదని చెబుతున్నారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్‌, యాపిల్ సంస్థకు దుబాయ్, అబుదాబి వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కార్పొరేట్ కార్యాలయాలు ఉన్నాయి. గల్ఫ్‌ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసిన ఇరాన్, ఇప్పుడు తన దష్టిని ఈ కార్పొరేట్ ఆఫీస్‌ల వైపు మళ్లించింది. 

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడుల్లో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏదో రకంగా యుద్ధం ఆపాలని అమెరికా ప్రయత్నిస్తుంటే, ఇజ్రాయెల్‌ సహకరించడం లేదు. ఇతర దేశాలు అమెరికాకు సపోర్ట్ చేయడం లేదు. అమెరికాలో యుద్ధం ఖర్చు పెరిగిపోవడంతో ఆ దేశంలో కూడా అలజడి మొదలైంది. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఇరాన్ చూస్తోంది. అందుకే అమెరికా హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తిరిగి బెదిరిస్తోంది. దీంతో ట్రంప్‌లో అసహనం పెరిగిపోతోంది. ఇంతలో ఇరాన్ కార్పొరేట్ దిగ్గజాలను టార్గెట్ చేస్తున్నట్టు ప్రకటించం అందర్నీ షేక్ చేస్తోంది. ఇది ఎలాంటి విపరిణామాలకు దారి తీస్తుందో అన్న టెన్షన్ కార్పొరేట్‌ సెక్టార్‌లో కనిపిస్తోంది.